మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమాకు ముందు అనుకున్న డైరెక్టర్ ఎవరో తెలుసా..!
అయితే సినిమాకి ముందుగా ఈ దర్శకుడిని అనుకోలేదట. మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమాని దర్శకుడు వివి వినాయక్ తీయాల్సి ఉందట. ఆది, చెన్నకేశవ రెడ్డి, ఠాగూర్, బధ్రీనాథ్ లాంటి యాక్షన్ సినిమాలు తీసి హిట్స్ అందుకున్నాడు వివి వినాయక్. ఆయన ఎప్పుడు ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలు తీసింది లేదు. అందుకే ప్రభాస్ వివి వినాయక్ కంటే వేరే దర్శకుడిని తీసుకోవడం మంచిది అని అభిప్రాయపడ్డారు. దిల్ రాజు మాత్రం ఇవి వినాయక అయితే న్యాయం సినిమా వస్తుందని భావించాడు. దిల్ రాజు వినాయక్‌తో మిస్టర్ పర్‌ఫెక్ట్ స్టోరీ పై కొద్ది రోజులు చర్చలు కూడా జరిపాడు. వినాయక్ ఈ కథ విన్న తర్వాత దిల్ రాజుకి ఓ సలహా ఇచ్చాడు.
"కథ సూపర్ గా ఉంది, ప్రభాస్ కు అన్ని విధాలా ఈ స్టోరీ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. కానీ, నేను దీనికి డైరెక్షన్ చేస్తే స్టోరీలోని ఫ్లేవర్ పూర్తిగా చేంజ్ అయిపోతుంది. నేను యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువగా పెడతాను కానీ కథలో ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే కంటెంట్ చాలా ఉంది. ఆ కంటెంట్‌ని మంచిగా డైరెక్ట్ చేస్తే చాలు సినిమా హిట్ అయిపోతుంది." అని దిల్ రాజుకి వినాయక్ చెప్పాడు. దాంతో దిల్ రాజు "సంతోషం" సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న దశరథ్ ని పిలిచి స్టోరీ నరేట్ చేశాడు. అయితే అప్పటిదాకా ప్రభాస్ చేసిన సినిమాలుకు అది పూర్తి విభిన్నంగా ఉండాలని ఆయనకు కొన్ని మార్పులు చేర్పులు చేశారు. మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమా ఔట్‌ఫుట్ దిల్ రాజు ఎంతో సంతృప్తి పడ్డారు. వినాయక్ చెప్పిన మాట వినడం వల్లే తన సినిమా ఎంత బాగా వచ్చిందని సంతోషపడ్డారు. ఈ సినిమా ప్రభాస్ కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ గా నిలిచింది.