ఆ లెటర్ పేరు ఉన్న హీరోయిన్లకు స్టార్ స్టేటస్ దక్కదా.. ఆ హీరోయిన్లు మునిగిపోయారుగా..!

RAMAKRISHNA S.S.
సాధారణంగా మన ఇండియాలో ప్రజలు అనేక సెంటిమెంట్లను ఫాలో అవుతుంటారు. పాలిటిక్స్ స్పోర్ట్స్ లో మాత్రమే కాదు. సినిమా ఇండస్ట్రీలోనూ సెంటిమెంట్లను నమ్మేవారు ఎక్కువ మందే ఉన్నారు. ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే ఒక సినిమా హిట్ కావడానికి దాని కథ, కథనం, హీరో యాక్టింగ్, డైరెక్షన్ స్కిల్స్ వంటివి మాత్రమే కారణం అవుతాయి. కానీ కొంతమంది ఇవేమీ కారణం కాదని కేవలం సెంటిమెంట్ వల్లే సినిమా హిట్ అయిందని బలంగా నమ్ముతుంటారు. ఆ సెంటిమెంట్ ఏదైనా కావచ్చు ఉదాహరణకి A అనే అక్షరంతో సినిమాలు తీస్తున్నాడు కాబట్టే త్రివిక్రమ్ సినిమాలు హిట్ అవుతున్నాయి అని కొంతమంది నమ్ముతారు.
అయితే ఇటీవల ఇలాంటి ఒక మరొక సెంటిమెంటు అభిమానుల్లో క్రియేట్ అయింది. అదేంటంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక అక్షరంతో పేర్లు మొదలైన హీరోయిన్లకు లక్ కలిసి రావట్లేదట. సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు గురించే అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు ఆ అక్షరం "R" అట. రకుల్, రాశీఖన్నా, రెజీనా హీరోయిన్లను ఉదాహరణగా చూపిస్తున్నారు. వీరు ఇప్పుడు ఇండస్ట్రీలో అంతూ పంతూ లేకుండా కనుమరుగయ్యారు.
నిజం చెప్పాలంటే వీరు అద్భుతంగా నటిస్తారు. వచ్చిన కొత్తలో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. కానీ దాన్ని నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్ డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది రకుల్. నాన్నకు ప్రేమతో, ధృవ, సరైనోడు సినిమాల స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. అయితే స్పైడర్, మన్మథుడు 2 వంటి సినిమాలు ఆమెకు వరుసగా ఫ్లాప్స్ అందించాయి. ఇవే ఆమె కెరీర్ కు పెద్ద మైనస్ అయ్యాయి.
 
ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లు కావడంతో రకుల్ ప్రీత్ సింగ్ వైపు చూడటమే మానేశారు దర్శకనిర్మాతలు. ఇతర ఇండస్ట్రీలలో ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకుంది కానీ అక్కడ కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతోంది. ఈ బ్యూటీ పేరు ఆరని అక్షరంతో స్టార్ట్ కావడం వల్లే ఆమెను దురదృష్టం వెంటాడుతోందని కొందరు నమ్ముతున్నారు. ఇక బబ్లీ గర్ల్ రాశీఖన్నా తారక్, రవితేజ, రామ్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి అలా గుర్తింపు తెచ్చుకుంది కానీ కెరీర్ పరంగా ఈ ముద్దుగుమ్మ అంతగా సక్సెస్ కాలేక పోయింది.
 
పక్కా కమర్షియల్ ఫ్లాప్ సినిమాతో ఆమె ఒక ఫ్లాప్ అందుకుంది దాని తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. వచ్చిన ఒకటి రెండు సినీ అవకాశాలు కూడా ఆమెకు నిరాశనే కలిగించాయి. రెజీనా యంగ్ హీరోలతో రొమాన్స్ చేస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీని షేర్ చేసింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో సైతం మెరిసింది కానీ స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. ఈ ముగ్గురు హీరోయిన్ల పేర్లలో మొదటి అక్షరం ర అవ్వగా, అదే వారికి కలిసి రాకపోవడానికి కారణమని అంటున్నారు. పేరులో మొదటి అక్షరం "ర లేదా R" అయి ఉంటే నిండా మునిగిపోవడం తప్ప స్టార్ స్టేటస్ దక్కదు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: