భ‌ర్త‌లో ఈ 4 అల‌వాట్లు భార్య‌కు ఎంత మాత్రం న‌చ్చ‌వు... అవి ఇవే.. ?

RAMAKRISHNA S.S.
- ( లైఫ్ స్టైల్‌ - ఇండియా హెరాల్డ్ ) . .

ఈ ప్రపంచంలో ఎన్నో బంధాలు .. అనుబంధాలు .. సంబంధాలు ఉంటాయి. ఎన్ని బంధాలు ఎన్ని అనుబంధాలు ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో భార్యతో సంసార జీవితం .. దాంపత్య జీవితం అనేది ఎంతో ముఖ్యం. దాంపత్య జీవితం అనేది తర్వాత తరాలకు ఒక నిలయం లాంటిది .. దాంపత్య జీవితం అందంగా ఉంటే మంచి పిల్లలు .. వారి భవిష్యత్తు తర్వాతి తరాలు సరిగా .. సక్రమంగా ఉండటం ఇవన్నీ ఉంటాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు .. అలకలు, అరమరికలు సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. అయితే వాటన్నింటిని తట్టుకుని దాంపత్య జీవితాన్ని అద్భుతంగా మలుచుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అయితే భర్తలో ఉండే కొన్ని అలవాట్లు సహజంగానే భార్యలకు నచ్చవు. భార్యల ఉండే కొన్ని విషయాలు భర్తలకు నచ్చవు. భర్తలో ఉండే కొన్ని అలవాట్లు భార్యలకు అస్సలు నచ్చవని మానసిక నిపుణులు చెబుతున్నారు.

భర్తలో ఉండే అలవాట్లు భార్యలకు చాలా ఇబ్బందిగా మారతాయట.. అవి ఏమిటో చూద్దాం. భార్యకు కొందరు సరైన సమయం కేటాయించలేరు. వృత్తిపరమైన జీవితంలో లేదా సంపాదనలో పడిపోయి భార్యకు సమయం ఇవ్వకపోవడంతో భార్య లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది అట. అలాగే ఇద్దరి మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడం ఇది కూడా భార్యాభర్తల మధ్య ఎడబాటును .. దూరాన్ని పెంచుతుందని చెబుతున్నారు. అలాగే పిల్లల పెంపకంలో నిర్లక్ష్యం కొందరు భ‌ర్త లు .. పిల్లల పెంపకంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇది కూడా భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అలాగే కొన్ని రహస్యాలను భార్య దగ్గర దాచిపెట్టి ఇంకొకరు ఫేవరెట్ గా ఉండటం భార్య‌ దగ్గర దాచిన విషయాలు ఇతరులకు చెప్పటం లేదా భార్య చేసిన పనిని మెచ్చుకోకపోవడం వంటివి భాగస్వామికి అస్సలు నచ్చవని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: