పాపం.. సూర్య - వరుణ్‌తేజ్‌కు అన్యాయం చేసింది ఎవరు.. ఏం జరిగింది.. ?
అయితే సినిమాకు రిజల్ట్ బాగున్నప్పుడే ఈ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కినట్టు .. మట్కా కు వచ్చిన టాక్ చాలా డిజాస్టర్ అని వచ్చింది .. కేవలం వరుణ్ తేజ్ నటనకు పడుతున్న మార్కులు చూసి మురిసిపోవటం తప్ప చేసేది ఏమీ లేదు. ఇక కంగువాకు మరింత కష్టతరమైన సమయం వచ్చింది. విడుదలకు ముందు ఈ సినిమాకు వచ్చిన హైప్ అంతా కాదు .. తమిళ బాహుబలి అన్నారు .. తెలుగులో కూడా మామూలు స్పందన రాలేదు. తెరపై సూర్య ఎప్పటిలాగా కష్టపడ్డాడు.. నెలరోజులు ముందు నుంచి ప్రమోషన్లు చేశాడు.. నడిపించాడు.
తాను ఒక్కడే ప్రమోషన్ బాధ్యత భుజాన పై వేసుకునే ప్రపంచం అంతా తిరిగాడు .. కానీ తలా తోకాలేని కథ .. అర్థం లేని పాత్రలు .. లౌడ్ నటన వీటి మధ్య కంగువా నలిగిపోయింది . ఏం నమ్మి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారో .. ఇది చూస్తున్న సూర్య అంత కష్టపడ్డాడో ఎవరికి అర్థం కావడం లేదు. పార్ట్ 2 అంటున్నా ఆశలు వదులుకోవటం మంచిదని చెన్నై వర్గాల టాక్. ఏది ఏమైనా అటు సూర్య .. ఇటు వరుణ్ ఇద్దరు ఈవారం ఫలితాలతో భంగపడ్డారు.. వాళ్ళ కష్టం వృధా అయింది. కథ ని ఎంచుకునేటప్పుడే ఒకటికి పది సార్లు ఆలోచించి ఉంటే ఈ భంగపాటు తప్పేదేమో అనుకోవాలి.