వరుణ్‌తేజ్‌కు మెగా సపోర్ట్ ఎందుకు లేదు.. ఏం జరిగింది... ?
అలాగే వీరే కాకుండా సాయిధరమ్ తేజ్ , వైష్ణవ తేజ్, వరుణ్ తేజ్ లు కూడా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి కెరియర్ మొదట్లో మెగా అభిమానుల నుంచి మంచి సపోర్టే వచ్చింది. అయితే ఈ ముగ్గురు పడి లేస్తూ తమ కెరీర్ ని కొనసాగిస్తున్నారు. వీరిలో వరుణ్ తేజ్ ది మొదటి నుంచి ఎంతో భిన్నమైన ప్రయాణం. వరుణ్ మిగతా హీరోల మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించలేదు. పెద్ద మాస్ హీరో కావడానికి తగ్గ కటౌట్ ఉన్న.. క్లాస్ టచ్ ఉన్న భిన్నమైన సినిమాలు చేస్తూ కెరీయర్ నుకొనసాగిస్తున్నాడు. ఫిదా , తొలిప్రేమ , ఎఫ్2 , గద్దల కొండ గణేష్ లాంటి సినిమాలతో వరుణ్ మంచి సక్సెస్ఫుల్ హీరోగా కనిపించాడు. కాని తర్వాత వరుస అపజయాలతో ఈ మెగా హీరో వెనక్కి వెళ్లిపోయాడు. గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ వంటి సినిమాలు భారీ డిజాస్టర్ కావడంతో వరుణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ మార్కెట్ కూడా భారీగా పడిపోయింది.
అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన మట్కా సినిమాతో అయినా వరుణ్ కెరియర్ గాడిలో పడుతుందని అంత అనుకున్నారు. వరుణ్ కూడా అదే నమ్మకంలో ఉన్నాడు. ఈసారైనా సరైన సినిమాతో వస్తానని అభిమానులను నిరాశపర్చునని చెప్పాడు. తీరా మట్కా సినిమా మాత్రం ప్రేక్షకుల అంచనాలను ఏం మాత్రం అందుకోలేకపోయింది. ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మొదటి ఆట నుంచి నెగటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమాకు ఎలాంటి బజ్ లేకపోవడం కారణంగ మట్కా బుకింగ్స్ కూడా సరిగా జరగలేదు. తొలి రోజు టాక్ అయినా బాగులుంది అనుకుంటే అదీ లేదు. హిందీలో కూడా రిలీజైన ఈ సినిమాకు తోలీరోజు మొత్తంగా కలిపి కోటి రూపాయలు మాత్రమే షేర్ వచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మిగతా ప్రేక్షకుల సంగతి పక్కన పెడితే ఒకప్పుడు వరుణ్‌కు అండగా ఉన్న మెగా అభిమానులు సైతం అతన్ని పట్టించుకోకుండా పక్కన పడేసారనే అనుమానాలు కూడా వస్తున్నాయి. వరుస ప్లాప్‌లు కారణంగా వాళ్ళు వరుణ్ మీద నమ్మకం కోల్పోయినట్టు కనిపిస్తుంది. వారు ఈ సినిమాకు సపోర్ట్ చేసి ఉంటే ఓపెనింగ్స్ మరీ ఇంత దారుణంగా ఉండేవి కావు అని కూడా అంటున్నారు. ఇక మారి మళ్లీ మెగా అభిమానుల నమ్మకం సంపాదించుకోవడానికి వరుణ్ ఎలాంటి సినిమాతో వస్తాడో చూడాలి.