అమితాబ్ ఎంత పట్టుబట్టిన .. అన్న ఎన్టీఆర్ బాలీవుడ్ లో సినిమా చేయకపోవటానికి కారణం ఇదే..!
తెలుగులోనే కాకుండా మన సౌత్ ఇండస్ట్రీలో ఉన్న అన్ని ప్రాంతీయ భాషల్లోనూ ఎన్టీఆర్ సినిమాలు చేశారు . ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్ నటించిన పౌరాణిక సినిమాలన్నీ తమిళం , కర్ణాటక భాషల్లోనే తెలుగులో కన్నా అత్యధిక రోజులు ఆడేవి . అయితే అదే సమయంలో బాలీవుడ్ లో యువ హీరోగా అమితాబచ్చన్ ఎదుగుతున్నారు .. ఎప్పుడూ జరిగే సినిమా ఈవెంట్లకు ఎన్టీఆర్ కూడా వెళ్లేవారు. అదే క్రమంలో ఎన్టీఆర్‌తో బాలీవుడ్ లో కూడా సినిమా చేయించాలని అమితాబ్ అనుకున్నారు.. ఎన్టీఆర్ తో కూడా అమితాబ్ సినిమా చేయాలని చెప్పగా.. అన్నగారు ఆ విన్నపాన్ని తిరస్కరించారు . కానీ పట్టు వీడన్ని విక్రమార్కుడిలా అమితాబ్ ఎన్టీఆర్ తో పదే పదే బాలీవుడ్ లో సినిమా చేయాలని కోరేవారు ..
దాంతో ఒక సినిమాకు ఆయన ఓకే చెప్పారు.. ఎన్టీఆర్ చేసే సినిమా నిర్మాత హఠాన్మరణం తో ఆ సినిమా షూటింగ్ దశలోనే ఆగిపోయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు బాలీవుడ్ పై కన్నెత్తి కూడా చూడలేదు . తనకు ప్రాంతీయ భాషల పట్ల మక్కువ ఎక్కువని చెప్పే అన్నగారు .. మొదటి ప్రాధాన్యం తెలుగుకే ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆయన తెలుగు సినిమాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. అంతేకాదు.. తెలుగులోనే ఎన్నో భిన్నమైన సినిమాలు తీసేందుకు అన్నగారు ప్రోత్సహించారనే టాక్ కూడా ఉంది. మొత్తంగా అన్నగారు.. బాలీవుడ్ నుంచి అవకాశం వచ్చినా.. సున్నితంగా తిరస్కరించి తెలుగుపై తన అభిమానాన్ని చాటుకున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.