అతిథి: దగ్గరుండి మరీ మహేష్ బాబును ముంచేసిన ఎన్టీఆర్.. హెయిర్ స్టైల్ పై ట్రోల్స్..?

Pandrala Sravanthi
- అతిథి లో మహేష్ బాబు హెయిర్ స్టైల్ పై భారీ ట్రోల్స్..
- ఎన్టీఆర్ వల్లే మహేష్ బాబుకి డిజాస్టర్..

 సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అతిథి మూవీ భారీ అంచనాల మధ్య వచ్చి ఎంత పెద్ద ప్లాఫ్ అయిందో చెప్పనక్కర్లేదు. ఈ సినిమా దసరా కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీగా డిజాస్టర్ అయింది. మరి ఈ సినిమా డిజాస్టర్ కి కారణం ఏంటి.. మహేష్ బాబు హెయిర్ స్టైలే సినిమాపై దెబ్బ కొట్టిందా.. ఇందులో ఎన్టీఆర్ చేసిన తప్పేంటి అనేది ఇప్పుడు చూద్దాం..
 సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అతిథి మూవీకి ఫస్ట్ ఛాయిస్ జూనియర్ ఎన్టీఆర్ అట..అయితే డైరెక్టర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లి అశోక్, అతిధి రెండు సినిమాల కథలను చెప్పారట. కానీ ఎన్టీఆర్ కి అశోక్ మూవీ స్టోరీ నచ్చింది.దాంతో అతిథి మూవీ ని మహేష్ బాబు తో చేయండి బ్లాక్ బస్టర్ అవుతుంది అని ఎన్టీఆర్ స్వయంగా సజెస్ట్ చేశారట. దాంతో వెంటనే డైరెక్టర్ సురేందర్ రెడ్డి మహేష్ కి కథ చెప్పగా ఆయనకి కూడా కథ నచ్చడంతో సినిమా ఓకే చేశారు. అయితే ఈ సినిమా కోసం చార్మి, నయనతార లను హీరోయిన్లుగా అనుకున్నప్పటికీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో బాలీవుడ్ బ్యూటీ అమృతా రావుని సినిమాలోకి దించారు. అయితే అప్పట్లోనే ఈ బ్యూటీ కి 60 లక్షల భారీ రెమ్యూనరేషన్ ఇచ్చారు. ఇక కొత్త హీరోయిన్ అలాగే కంటెంట్ కూడా కొత్తగా ఉంది అని సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఇక సినిమా పూజ కార్యక్రమాలు మొదలుపెట్టాక దాదాపు నాలుగు నెలలకు షూటింగ్ జరిగింది.

ఎందుకంటే మహేష్ బాబు అతిథి మూవీ కోసం కొత్త లుక్ రావడానికి నాలుగు నెలల సమయం తీసుకున్నారు. అలా షూటింగ్ ఆలస్యం అయిపోయింది.అయితే ఈ సినిమా కోసం ముందుగా నాజర్ పాత్రకి ప్రకాష్ రాజ్ ని ఎంచుకొని కొన్ని సీన్స్ షూట్ చేశాక చివరికి తప్పుకోవడంతో నాజర్ ని పెట్టి మళ్లీ షూట్ చేశారట.అలాగే ఈ సినిమా చివర్లో చిన్న పాపని చంపే సన్నివేశం మొదట్లో ఉండదు. కానీ అప్పటికప్పుడు ఈ సన్నివేశాన్ని క్రియేట్ చేయడంతో ఈ సినిమాకి ఈ సీన్ పెద్ద మైనస్ అయింది. అలాగే తన ప్రతి సినిమాకి తన హెయిర్ స్టైల్ ని మార్చుకునే మహేష్ బాబు ఇప్పటికే ఎంతోమందిని తన హెయిర్ స్టైల్ తో అట్రాక్ట్ చేశారు. అలా ఎన్నో సినిమాల్లో మహేష్ బాబు డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్ లో కనిపిస్తారు. అలా అతిధి మూవీలో కూడా హెయిర్ పెంచి కలర్ వేసుకొని కొత్తగా ట్రై చేశారు. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు హెయిర్ స్టైల్ పై అప్పట్లో చాలా ట్రోల్స్ వచ్చాయి. అంతేకాదు మహేష్ బాబు పై నెగిటివిటీ ఉన్న కొంతమంది హీరోల అభిమానులు మాత్రం ఈ సినిమాలో మహేష్ బాబు హెయిర్ స్టైల్ ఎన్నో విమర్శలు చేశారు. ఇక ఈ సినిమా ప్లాప్ అవ్వడానికి మహేష్ హెయిర్ స్టైల్ కూడా ఓ కారణం గా చెప్పుకోవచ్చు.అలా స్క్రిప్ట్,డైరెక్షన్,మహేష్ లుక్స్ పరంగా సినిమా ఫ్లాప్ అయ్యింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: