"సిగ్గు లేదారా నీకు..?" అఖిల్ ని అడిగి కడిగి పడేసిన తెలుగు హీరోయిన్..ఏమైందంటే..?

Thota Jaya Madhuri
అక్కినేని అఖిల్ అంటే చాలామంది ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి ఇష్టం. మరీ ముఖ్యంగా అఖిల్ ఏ విషయానికి కూడా సీరియస్ గా తీసుకోడు . చాలా జెన్యూన్ గా ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. మరి ముఖ్యంగా అఖిల్ స్టేటస్ ని కాకుండా మనిషి మనస్తత్వాన్ని నమ్మి ఫ్రెండ్షిప్ చేస్తాడు అని చాలామంది చెప్పుకొస్తూ ఉంటారు . ఇండస్ట్రీలో అఖిల్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అఖిల్ హిట్ కొట్టకపోయినా సరే ఆయనను ఆరాధించే అభిమానించే వాళ్ళు కూడా ఉన్నారు . మరి ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని అఖిల్ కి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఆయన బాగా మింగిల్ అయ్యే వ్యక్తి మాత్రం నాగచైతన్యనే.


ఈ విషయాన్ని అఖిల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అఖిల్ - నాగచైతన్య పేరుకి బ్రదర్స్ అయినప్పటికీ ఫ్రెండ్స్ లా బిహేవ్ చేస్తూ ఉంటారట.  ఒకరికి ఒకరు పర్సనల్ విషయాలను షేర్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారట . మరీ ముఖ్యంగా సమంత లవ్ మ్యాటర్ ని నాగచైతన్య అఖిల్ కే ముందుగా చెప్పారట . అఖిల్ అంటే సమంతకి కూడా చాలా చాలా ఇష్టం.  విడాకులు తీసుకున్న సరే అఖిల్ సినిమాని సపోర్ట్ కూడా చేసింది . అలాంటి సమంత అక్కినేని ఇంటికి కోడలుగా ఉన్నప్పుడు అఖిల్ ని "సిగ్గు లేదారా నీకు..?" అంటూ ఘాటుగా అడిగి కడిగి పడేసిందట .


దానికి కారణం అఖిల్ మందు తాగే అలవాటు ఉండడమే . అఖిల్ కి మందు తాగొద్దు అంటూ ఎన్నోసార్లు నాగార్జున - అమల చెప్పి చూశారట . అయినా సరే ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసేటప్పుడు ఫ్లోలో కొన్ని కొన్ని సార్లు తాగేస్తూ  ఇంటికి వస్తారట. ఒకానొక మూమెంట్లో సమంత ఇంట్లో ఉన్న టైంలో అఖిల్ అలాగే మందు తాగి ఇంటికి వచ్చాడట . అది చూసి సమంత ఫుల్ ఫైర్ అయిపోయిందట. "సిగ్గు లేదారా ..? నీకు ఎన్నిసార్లు చెప్పాలి ..? లిమిట్స్ క్రాస్ చేసి మరి తాగొద్దు" అని అంటూ ఘాటుగా అఖిల్ ని ఓ తల్లి ఒక బిడ్డను ఎలా తిడుతుందో..తిట్టేసి జాగ్రత్తలు చెప్పిందట . అంత మంచి రిలేషన్షిప్ సమంత - అఖిల్ మధ్య ఉండింది. కానీ ఆ దేవుడు కూడా ఓర్వలేకపోయాడు . వాళ్ళ మధ్య బంధాన్ని తుంచేశాడు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: