మొదటి సినిమా సక్సెస్ అందుకున్న అంజలా ఝవేరి.. ఇప్పుడేం చేస్తోందంటె..?
•మెగాస్టార్ తో జతకట్టిన అంజలా ఝవేరి.
•బాలీవుడ్ నుంచి వచ్చి తెలుగులో భారీ సక్సెస్..
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఇతర భాషల నుంచి హీరోయిన్స్ కూడా పదుల సంఖ్యలో వస్తూ ఉన్నారు. అయితే ఇందులో కేవలం కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతూ ఉండగా.. మరి కొంతమంది కనుమరుగైపోతున్నారు. అలా తనదైన స్టైల్ లో వరుస సినిమాలు చేసుకుంటూ తన నటనతో అలరించి సడన్గా సినిమాలకు దూరమైన వారిలో హీరోయిన్ అంజలా ఝవేరి కూడా ఒకరు. అప్పట్లో ఎంతో మంది కుర్రకారుల హృదయాలను దోచుకున్న ఈమె వెంకటేష్ నటించిన ప్రేమించుకుందాం రా సినిమాలో నటించింది.
తన మొట్టమొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న అంజలా ఝవేరి , రెండవ సినిమాకి ఏకంగా మెగాస్టార్ తో నటించే అవకాశాలను అందుకున్నది. అలా 1998లో విడుదలైన చూడాలని ఉంది సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో.. ఆ వెంటనే రావోయి చందమామ, దేవి పుత్రుడు, తదితర చిత్రాలలో నటించింది. యూత్ లో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్న అంజలా ఝవేరి తెలుగు కన్నడ హిందీ వంటి భాషలలో కూడా నటించింది. అగ్ర హీరోలతో జత కట్టిన సమయంలోనే కెరియర్ పీక్స్ స్టేజ్ లో ఉన్నప్పుడు బాలీవుడ్ నటుడైన తరుణ్ ఆరోరా ను ప్రేమించి వివాహం చేసుకుంది
అంజలా ఝవేరి భర్త కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.. ఖైదీ నెంబర్ 150, జయ జానకి నాయక, అర్జున్ సురవరం వంటి చిత్రాలలో విలన్ గా నటించారు. 20 ఏళ్లుగా ప్రేమించుకొని వివాహం చేసుకున్నారట. 2012లో చివరగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో నటించింది అంజలా ఝవేరి. అయితే తెలుగులో కూడా తాను నటించడానికి సిద్ధంగానే ఉన్నానని కానీ మంచి పాత్రలు వస్తేనే చేస్తానని చెప్పింది. అంజలా ఝవేరి భర్త మాత్రం టాలీవుడ్ లో స్టైలిష్ విలన్ గా పేరు సంపాదించే పలు చిత్రాలను నటిస్తూ ఉన్నారు.