ఆ సినిమాకి నాకంటే జ్యోతిక పారితోషకం అన్నిరెట్లు ఎక్కువ.. సూర్య..!

Pulgam Srinivas
కోలీవుడ్ నటుడు సూర్య , ఫుల్ క్రేజీ నటి జ్యోతిక చాలా సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే వీరు ప్రేమించి పెద్దలను ఒప్పించి అందరి సమక్షంలో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత కూడా వీరు ఎంతో అన్యోన్యంగా జీవితాన్ని ముందుకు సాగిస్తున్నారు. పెళ్లి తర్వాత సూర్య వరుస పెట్టి సినిమాల్లో నటిస్తూ వస్తుండగా , పెళ్లికి ముందు కమర్షియల్ సినిమాలలో నటించిన జ్యోతిక పెళ్లి తర్వాత అలాంటి సినిమాల్లో కాకుండా వైవిధ్యమైన సినిమాలలో , కథకు ప్రాధాన్యత ఉండి , నటనకు స్కోప్ ఉన్న సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.

ఇక వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ప్రస్తుతం జీవితాన్ని ముందుకు సాగిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సూర్య పాల్గొన్నాడు. అందులో భాగంగా సూర్య ... జ్యోతిక గురించి ఎన్నో ఆసక్తికరమైన వివరాలను తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూ లో సూర్య జ్యోతిక గురించి మాట్లాడుతూ ... డోలి సజా కే రాఖ్నా అనే హిందీ సినిమా జ్యోతిక మొదటి సినిమా. ఆ తర్వాత తన రెండవ సినిమా నాతోనే చేసింది. అది నాకు ఐదవ సినిమా. అది నాకు ఐదవ సినిమా అయినా కూడా నేను కాస్త కంగారు పడేవాడిని ... డైలాగ్స్ మర్చిపోయావాడిని. కానీ జ్యోతిక తన రెండవ సినిమా , అందులోను తమిళ్లో మొదటి సినిమా.

అయినా పెద్దగా కంగారు పడేది కాదు. ఏ డైలాగ్ ఇచ్చిన నిమిషాల్లో చెప్పేది. అలాగే నాకు కాస్త సపోర్ట్ కూడా చేస్తూ ఉండేది. అలా మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం. కాక్క కక్కా అనే సినిమాలో మళ్లీ మేము కలిసి పని చేశాం. ఆ సినిమా సమయంలో నా క్రేజ్ కంటే జ్యోతిక క్రేజ్ ఎక్కువ. దానితో నాకు ఇచ్చిన పారితోషకం కంటే జ్యోతిక కు మూడు రెట్లు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చారు అని సూర్య తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: