సూర్య-జ్యోతిక కోలీవుడ్లో మోస్ట్ పాపులర్ స్టార్ ప్రేమ జంట. సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా వీరిద్దరూ అంతే అన్యోన్యంగా హ్యాపీగా ఉంటూ.. ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎంతో మందికి వీళ్లు స్ఫూర్తిదాయకం. నార్త్ ఇండియన్ అయిన జ్యోతికకు.. పక్కా తమిళ హీరో అయిన సూర్యకు ప్రేమ చిగురించింది.. అదిపెళ్ళిగా మారింది. కుటుంబ సభ్యుల అంగీకారంతో సూర్య, జ్యోతిక 2006లో పెళ్లి చేసుకున్నారు. వీరికి దియా, దేవ్ అనే ఇద్దరు పిల్లలు. కెరీర్లో ఉన్నత స్థితిలో ఉండగానే సూర్యను పెళ్లి చేసుకున్న జ్యోతిక పెళ్లి తర్వాత సినీ పరిశ్రమకు దూరమైంది. దాదాపు 7 ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంటూ 36 ఏళ్ల వయసులో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది జ్యోతిక. ఇక తన సెకండ్ ఇన్నింగ్స్ లో హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రల్లో నటిస్తోంది. మరోవైపు సూర్య కూడా డిఫరెంట్ స్టోరీస్ ను సెలక్ట్ చేసుకుంటూ.. వరుస సినిమాలు చేస్తున్నాడు.
సూర్య సినిమాలు వరుసగా హిట్ అవుతుండటంతో.. సూర్య డిమాండ్ కూడా పెరిగింది. రెమ్యునరేషన్ కూడా పెంచినట్టు సమాచారం.ప్రస్తుతం సూర్య కంగువా సినిమాలో నటిస్తున్నాడు. దాదాపు 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం నటుడు సూర్య 30 కోట్ల వరకూ రెమ్యునరేషన్ వరకూ తీసుకున్నట్టు తెలుస్తోందిఅలాగే ఆయన భార్య జ్యోతిక కూడా మలయాళం, హిందీ, తమిళం వంటి పలు భాషల్లో ఆమె నటిస్తోంది. ఒక్కో సినిమాకు 5 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది . ఇదిలావుండగా సూర్య, జ్యోతిక ఇద్దరూ సినిమాల్లోనే కాకుండా బిజినెస్లో కూడా జోడీగా సక్సెస్లు సాధిస్తున్నారు. ఇద్దరూ కలిసి 2డి అనే ప్రొడక్షన్ కంపెనీని కూడా నడుపుతున్నారు. ఈ సంస్థ నిర్మించిన సూరార్ భోటో , జై భీమ్, కడకుట్టి సింహం, విరుమాన్ వంటి చిత్రాలు మాస్ హిట్గా నిలిచి కోట్లను రాబట్టాయి.
కోలీవుడ్లో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ కపుల్స్లో సూర్య, జ్యోతిక ఒకరు. ఎట్ ప్రజెంట్ వారి వారి సినిమాలతో బిజీగా ఉన్న వీరిద్దరూ.. వీరిద్దరి ఆస్తుల గురించి ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అయితే అకార్డింగ్ టూ ఆ న్యూస్.. స్టార్ హీరో సూర్య ఆస్తి కంటే.. భార్య జ్యోతిక ఆస్తే ఎక్కవట. సూర్య కంటే దాదాపు 125 కోట్ల వరకు ఎక్కువగా ఆస్తులను కూడేసిందట జ్యోతిక. అయితే ఈ న్యూస్ ఇప్పుడు కోలీవుడ్లో హాట్ టాపిక్ అవుతోంది. ఈనేపథ్యంలోనే ఈ రొమాంటిక్ కపుల్ ఆస్తి విలువ కూడా రోజురోజుకు పెరుగుతోంది. అయితే సూర్య ఆస్తుల కంటే కూడా జ్యోతిక ఆస్తులు ఎక్కువ. సూర్య ఆస్తుల విలువ కేవలం 200 కోట్లు మాత్రమే అని తెలుస్తోంది. అయితే ఇదే క్రమంలో నటి జ్యోతిక నికర విలువ 330 కోట్ల వరకూ ఉంటుందని సమాచారం. వీరందరి ఆస్తులు రూ.530 కోట్లకుపైగా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. దీంతో కోలీవుడ్లో అత్యంత ధనిక జంటగా నిలిచారు.