సూర్యకి ఆమంటే క్రష్.. సీక్రెట్ రివీల్ చేసిన కార్తి?

praveen
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారికి అభిమానులు ఏ రేంజ్ లో ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏకంగా కోట్లాదిమంది ప్రేక్షకులు ఆయా హీరోలను అభిమానిస్తూ ఉంటారు. ఇక వారి సినిమాలు విడుదలయ్యాయి అంటే చాలు సంబరాలు చేసుకుంటూ మరి ఇక సినిమాను ఆదరించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మధ్యకాలంలో  భాషా భేదమే అనేది లేకుండా పోయింది. దీంతో ఎంతో మంది హీరోలు కేవలం ఒక భాషలో మాత్రమే కాదు అనేక భాషల్లోనూ అభిమానులను సంపాదించుకోగలుగుతున్నారు.

 అయితే ఇలా కోట్లాదిమంది ప్రేక్షకుల ప్రేమను గెలుచుకున్న స్టార్ హీరోలు కూడా కొంతమంది నటీనటులకు అభిమానులుగా కొనసాగుతూ ఉంటారు. ఎంతో మంది అమ్మాయిలకు క్రష్ అయినా ఆయా హీరోలకి కూడా స్పెషల్ క్రష్ లు ఉంటారు. అయితే ఈ విషయాలను తెలుసుకునేందుకు అభిమానులు ఎప్పుడు ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. ఇలాంటి పర్సనల్ విషయం ఏదైనా తెరమీదకి వచ్చింది అంటే చాలు అదికాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. తమిళంలో స్టార్ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా అదే రేంజ్ ను మెయింటైన్ చేస్తూ కోట్లాదిమంది అభిమానుల ప్రేమను గెలుచుకున్న హీరో సూర్య క్రష్ ఎవరు అన్న విషయం ఇటీవల హాట్ టాపిక్ మారిపోయింది.

 మరికొన్ని రోజుల్లో సూర్య కంగువ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ ఎలా ఉంటుంది అనే విషయంపై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఇటీవలే బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమంలో పాల్గొన్నారు సూర్య. అయితే ఇక్కడ సూర్య కాదు ఏకంగా సూర్య క్రష్ పేరును మరో హీరో సూర్య తమ్ముడు కార్తీ వెల్లడించారు. అన్ స్టాపబుల్ షోలో హోస్ట్ బాలకృష్ణ ఫోన్ లో కార్తిని సూర్య ఫస్ట్ క్రష్ ఎవరో చెప్పాలని అడిగాడు. చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలు సాంగ్ కు స్టెప్పులు వేసిన హీరోయిన్ గౌతమి అని కార్తీక్ చెప్పాడు. ఈ మాత్రం హింటిస్తే చాలు అంటూ పోస్ట్ బాలకృష్ణ ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడు సూర్య స్పందిస్తూ అరే కార్తి నువ్వు కత్తి రా కార్తీ కాదు అంటూ అనడంతో అక్కడున్న వారందరూ కూడా నవ్వుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: