అనుష్క శెట్టి బర్త్ డే స్పెషల్: ఇప్పటివరకు అలా చేసిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ ఈమె..!

Thota Jaya Madhuri
నవంబర్ ఏడవ తేదీ అంటే అది కేవలం డేట్ మాత్రమే కాదు . అది అనుష్క శెట్టి  ఫ్యాన్స్ కి ఒక పండగ లాంటి రోజు . ఎందుకంటే అది ఆమె పుట్టినరోజు . అనుష్క శెట్టిని ఎంతలా అభిమానిస్తూ ఆరాధిస్తూ ఉంటారో జనాలు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . జేజమ్మ అంటూ ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు . మరి కొంతమంది స్వీటీ అంటూ కూడా నాటిగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. నాటిగా కామెంట్ చేసిన ట్రోల్ చేసిన హార్ట్ గా మాట్లాడిన అనుష్క శెట్టి మాత్రం ఎప్పుడూ ఒకటేలా బిహేవ్ చేస్తూ ఉంటుంది.  తన పని తను చూసుకోపోతూ ఉంటుంది.


కాంట్రవర్షియల్ కంటెంట్ లో ఇరుక్కోదు. కాంట్రవర్షియల్ అయ్యే మాటలు అస్సలు మాట్లాడదు . అందుకే అనుష్క శెట్టి అంటే అందరికీ చాలా ఇష్టం . నేడు ఆమె పుట్టిన రోజు . ఆమె పుట్టిన రోజుని కుటుంబ సభ్యులతో చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకుంటుంది అనుష్క శెట్టి . కాగా ఇదే క్రమంలో అనుష్క శెట్టి కి సంబంధించిన వార్తలను బాగా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు.  ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ ఉన్నా కూడా అనుష్క శెట్టికే ఇంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎందుకు అన్న విషయం బాగా వైరల్ గా మారింది.


ఆమె ఇండస్ట్రీలో చాలా రిస్క్ చేసిన పాత్రలు కూడా ట్రెండ్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా అనుష్క శెట్టి "సైజ్ జీరో" సినిమా కోసం చాలా బరువు పెరిగింది. అంతేకాదు "వేదం" సినిమా కోసం చాలా చాలా రిస్కులే చేసింది. ఒక స్టార్ హీరోయిన్ ఏకంగా వ్యభిచారి పాత్రలో మెరిసి సినీ ఇండస్ట్రీని షేక్ చేసింది . అంతేకాదు అనుష్క శెట్టి తన క్యారెక్టర్ కోసం ఎలాంటి రిస్క్ అయినా తీసుకుంటుంది. 'బిల్లా' సినిమాలో ఎక్స్పోజింగ్ చేసే పాత్ర అయినా 'అరుంధతి' సినిమాలో ట్రెడిషనల్ గా ఉండే పాత్రైన ఏ పాత్రకైనా సరే ప్రాణం పెట్టినటిస్తుంది. అందుకే ఇండస్ట్రీలో ఆమెకు అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్.  సినిమా కోసం ఎలాంటి రిస్క్ అయినా చేసి ఆ నెగెటివిటీని కూడా పాజిటివిటీగా మార్చుకునే ఏకైక హీరోయిన్ అనుష్క శెట్టి అంటూ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. సైజ్ జీరో సినిమా కోసం భారీ స్థాయిలో బరువు పెరిగి ఆ తర్వాత బరువు తగ్గడానికి అనుష్క ఎంత కష్టపడిందో మనకు తెలిసిందే.  ఇప్పటికి ఆమె తన బాడీని కరెక్ట్ సైజులో మైంటైన్ చేయలేక పోతుంది . అయినా సరే అనుష్క శెట్టి సైజ్ జీరో రిజల్ట్ విషయంలో మాత్రం హ్యాపీగానే ఉంది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: