ఆ ఇన్నేర్‌ వేర్లతో కోట్లు సంపాదిస్తున్న దిశా పటానీ ?

Veldandi Saikiran
బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటాని గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. దిశా ఇటీవల రిలీజ్ అయిన కల్కి సినిమాతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2016లో వచ్చిన ఎమ్మెస్ ధోని అన్ టోల్డ్ లవ్ స్టోరీ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన దిశ ఆ తర్వాత పలు సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. భాగీ, భారత్, మలంగ్ వంటి సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. లోఫర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన దిశా తెలుగులో ఆడియన్స్ ను ఆకట్టుకుంది.

వెండితెరపై అందాలు ఆరబోసి ప్రేక్షకుల మనసులను దోచుకుంది. అంతేకాకుండా తెలుగులో వరుసగా అవకాశాలను అందుకుంది. మరిన్ని సినిమాల్లో అవకాశాలను రాబట్టాలని విపరీతంగా ప్రయత్నాలు చేస్తోంది. రీసెంట్గా ప్రభాస్ హీరోగా నటించిన ప్రాజెక్ట్ కే సినిమాలో ఈ బ్యూటీ నటించింది. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ రేంజ్ లో వసూళ్లను రాబట్టింది.

సినిమాల ద్వారా భారీగా డబ్బులను సంపాదిస్తున్న దిశా ఇన్నర్ వేర్ లతో కూడా కోట్లను సంపాదిస్తుందట. కరోనా ముందు నుంచి దిశా సికె బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తోంది. 2020 దీపావళికి మొదటిసారి కెల్విన్ క్లెయిన్ లో దుస్తులు ధరించి దీపారాధన చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. లక్ష్మీదేవి వస్తుంది అనుకుంటే సికె..... దేవి వచ్చిందంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.

కానీ సీకే బ్రాండ్ ప్రచారానికి భారీ రేంజ్ లో వసూళ్లు వచ్చాయి. యూత్ కి బ్రాండ్ ని ఒక రేంజ్ లో కనెక్ట్ చేయడంలో దిశా సక్సెస్ అయ్యింది. ప్రతిసారి ఏదో ఒక సందర్భాన్ని చూసుకొని వివాదాస్పద ఫోటోషూట్లతో ప్రచారాలు చేస్తుంటుంది. గత నాలుగు ఏళ్ల నుంచి ఈ బ్యూటీ సీకే బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ కోట్లలో డబ్బులను సంపాదిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: