టాలీవుడ్‌లో సమంతకు అవకాశాలు రావట్లేదా.. రాకుండా చేస్తున్నారా.. !

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

టాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత అంటే సౌత్ ఇండియాలోనే కాదు.. అటు నార్త్ ఇండియా లోను ఎలాంటి పాపులారిటి సంపాదించుకున్నారో ? ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాగచైతన్య హీరోగా వచ్చిన ఏ మాయ చేసావే సినిమాతో హీరోయిన్గా పరిచయమైన సమంత.. పదేళ్లపాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పాటు.. సౌత్ సినీ ఇండస్ట్రీని ఏలేశారు. తన తొలి సినిమా హీరో నాగచైతన్యతో.. ఏకంగా ఐదు సినిమాలలో జంటగా కలిసి నటించిన సమంత.. అతడితో ప్రేమలో పడి 2017లో పెళ్లి చేసుకున్నారు.

వీరు కలిసి నాలుగేళ్లు కూడా కాపురం చేయకుండానే.. 2021 లో విడిపోయారు. సమంత ఇప్పటికీ సింగిల్గానే ఉంది. చైతన్య మాత్రం మరో హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో పడి పెళ్లికి రెడీ అవుతున్నాడు. వీరిద్దరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అయితే సమంత సెటాడెల్‌.. హనీ బన్నీ వెబ్ సిరీస్‌తో బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో ఆమె చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తాయి. ఆమె మధ్యలో నటించిన యశోద సినిమా యావరేజ్ కాగా.. శాకుంత‌లం పెద్ద డిజాస్టర్ అయింది. ఈ సినిమా సమంత పరువు మొత్తం తీసేసింది.

రీఎంట్రీ ఇచ్చాక కూడా టాలీవుడ్ లో ఆమె సినిమాలు చేస్తున్న దాఖలాలు లేవు. దీనిపై తాజాగా ఆమె చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. ఐఫా అవార్డ్స్ వేడుకలో యంగ్ హీరో రానా, తేజ స‌జ్జా ల‌తో చేసిన ఇంట్రాక్షన్‌లో సమంత.. రానాని ఎందుకు సినిమాలు చేయట్లేదు అంటే నన్నెవరూ తీసుకోవట్లేదు అని రానా బదులిచ్చాడు. వెంటనే సమంత కూడా తనకి కూడా అలాగే ఉంది అంటూ కామెంట్ చేసింది. ఈ కామెంట్స్ ఇప్పుడు బాగా వైరల్‌గా మారాయి. సమంతకు టాలీవుడ్‌లో అవకాశాలు రావడం లేదా.. అవకాశాలు రాకుండా చేస్తున్నారా.. అన్న చర్చలు కూడా మొదలయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: