తెలుగు హీరోపై మోజు..అర్థరాత్రుళ్లు ఫోన్ చేస్తున్న హనీ రోజ్ ?
బాయ్ ఫ్రెండ్ అనే మలయాళ సినిమాతో నటిగా పరిచయమైంది. ఆ సినిమాతో ఈ బ్యూటీ అక్కడ ప్రేక్షకులకు డ్రీమ్ గర్ల్ గా మారింది. అనంతరం మలయాళం, తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించిన తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీకి ఆలయం సినిమాతో పరిచయమైంది. అయినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలలో నటించి ప్రేక్షకులను అలరించింది. అనంతరం నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య బాబుకు మరదలు పాత్రలో నటించింది. దీంతో ఈ బ్యూటీకి విపరీతమైన గుర్తింపు వచ్చింది. ఆ సినిమా అనంతరం హనీ రోజ్ కి వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి.
సినిమాల్లోనే కాకుండా అంతేకాకుండా పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్, యాడ్స్ చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. సోషల్ మీడియాలోనూ విపరీతంగా ఫ్యాన్ బేస్ ను పెంచుకుంది. తన అంద చందాలను సోషల్ మీడియాలో ప్రేక్షకులతో పంచుకుంది. నిత్యం ఏదో ఒక ఫోటోను షేర్ చేస్తూ తన అందాలను ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చేది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హీట్ పెంచుతూ ఉండేవి. ఇదిలా ఉండగా.... ఈ బ్యూటీ ఇప్పటివరకు సినిమాల్లో నటించింది. ఇక త్వరలోనే నిర్మాతగా మారాలని నిర్ణయించుకుందట.
హనీ రోజ్ వర్గీస్ ప్రొడక్షన్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను హనీ రోజ్ ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని తాజాగా హనీ రోజ్ సోషల్ మీడియా వేదికగా తెలపడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే హానీ రోజ్ ఓ తెలుగు హీరోపై ఇష్టంతో అతనికి ఫోన్ కాల్ చేస్తుందట. అర్ధరాత్రి సమయంలో ఫోన్లు చేసి ఆ హీరోను తెగ విసిగిస్తుందట. నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ చెబుతుందట. అయినప్పటికీ ఆ హీరో పట్టించుకోకపోవడంతో ఈ బ్యూటీ కాస్త ఫీల్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ వార్తలో ఏ మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.