నిహారిక ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోబోతున్న మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య.. రివేంజ్ అంటే ఇదేగా..!?
ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఆ బాండింగ్ కుదరలేదు.. కుదరడం లేదు అని తెలియదా..? ముద్దులు పెట్టుకున్నప్పుడు వాళ్ళ మధ్య మనస్పర్ధలు రావు అని తెలియదా..? అణ్ణీ తెలిసిన వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకోవాలి ..?అప్పుడే పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చు కదా..? వివాహ బంధాన్ని వక్రీకరించడమేగా..?అంటూ పలువురు ఫైర్ అవుతున్నారు. అయితే కొందరు స్టార్ సెలబ్రిటీస్ మాత్రం తమకు నచ్చిన రేంజ్ లో పెళ్లి చేసుకోవడం విడాకులు తీసుకోవడం మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవడం ఎక్కువగా చేస్తున్నారు .
తాజాగా సోషల్ మీడియాలో నాగచైతన్య పెళ్లికి సంబంధించిన వార్త ఎలా ట్రెండ్ అవుతుందో మనం చూస్తున్నాం . సమంతను ప్రేమించి పెళ్లి చేసుకొని ఆమెకు విడాకులు ఇచ్చేసి ఇప్పుడు మరొక హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను పెళ్లి చేసుకోబోతున్నాడు . అయితే తాజాగా సోషల్ మీడియాలో మరొక వార్త హాట్ గా ట్రెండ్ అవుతుంది. నిహారిక మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . అది కూడా నిహారిక క్లోజ్ ఫ్రెండ్ ని అంటూ వార్తలు బాగా వినిపిస్తున్నాయి.
దీనిపై ఎటువంటి అఫీషియల్ ప్రకటన లేనప్పటికీ చాలామంది ఈ వార్తను ఎక్కువగా ట్రెండ్ చేస్తున్నారు. అదే జరిగితే మాత్రం నిహారిక కు జొన్నలగడ్డ చైతన్య గూబ గుయ్యమని షాక్ ఇచ్చినట్లే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు . మరి కొందరు మాత్రం చిన్న ఎజ్ కదా ..? వాళ్లకి ఒక తోడు కావాలి కదా ..? అంటూ ఆయన రెండో పెళ్లిని సమర్థిస్తున్నారు. అసలు నిజానికి జొన్నలగడ్డ చైతన్య రెండో పెళ్లి చేసుకుంటున్నాడా..? ఇది కేవలం గాలికి పుట్టిన గాలివార్తైనా..? ఏమో ఆయన స్పందిస్తేనే బాగుంటుంది..!!?