షాక్: గాయాలపాలైన హీరో విజయ్ దేవరకొండ.. ఆందోళనలో ఫ్యాన్స్..!
2025 మార్చి 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే విధంగా మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. అయితే ఆ సమయానికి ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే సినిమాని విడుదల చేయాలని అటు హీరో విజయ్ దేవరకొండ కూడా చాలా కష్టపడుతున్నారట.ఈ క్రమంలోనే ఈ చిత్రంలో అత్యంత కీలకమైన ఒక యాక్షన్స్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో విజయ్ దేవరకొండ షోల్డర్ కి ఇంజ్యూర్ అయినట్లుగా తెలుస్తోంది. అయినప్పటికీ కూడా విజయ్ దేవరకొండ ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఒకపక్క ఫిజియోథెరపీ తీసుకుంటూ కొంత సమయానికి మళ్లీ సినిమా షూటింగ్లోకి ఎంట్రీ ఇచ్చారట.
ఈ విషయం విన్న అభిమానులు నిజంగానే విజయ్ దేవరకొండ డెడికేషన్ కి ఆయన హార్డ్ వర్క్ కి ఫిదా అవుతున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీ వలె లక్కీ భాస్కర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా డైరెక్టర్ త్రివిక్రమ్, విజయ్ దేవరకొండ గురించి తెలియజేయడం జరిగింది. తన కెరియర్లో చాలా ప్రేమను, ద్వేషాన్ని కూడా చూశాడని చాలా గట్టోడు అంటూ తెలియజేశారు త్రివిక్రమ్. ఇప్పుడు మరొకసారి VD -12 షూటింగ్లో షోల్డర్ ఇంజ్యూర్ అయినప్పటికీ కూడా దర్శక నిర్మాతలను దృష్టిలో పెట్టుకొని మరి నొప్పిని భరించి సినిమా షూటింగ్లో పాల్గొన్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం అయితే ఈ విషయం వైరల్ అవుతుంది.