కంటెంట్ లేక కష్టపడుతున్న పుష్ప 2 యూనిట్.. మొదట ఆ తప్పు చేసి ఉండాల్సింది కాదు..?

MADDIBOINA AJAY KUMAR
అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 మూవీ తెరకెక్కుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో రెండవ భాగంపై ప్రేక్షకుల్లో మొదటి నుండి భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాను చాలా రోజుల క్రితం ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించిన సమయానికి ఆగస్టు 15 వ తేదీకి చాలా గ్యాప్ ఉండడంతో కచ్చితంగా ఈ సినిమా ఆగస్టు 15 వ తేదీన విడుదల అవుతుంది అని చాలా మంది భావించారు.

ఇకపోతే ఈ మూవీ బృందం కూడా ఈ సినిమాను ఆగస్టు 15 వ తేదీన విడుదల చేసే విధంగానే ఈ మూవీ ప్రచారాలను చేస్తూ వచ్చింది. అందులో భాగంగా చాలా రోజుల క్రితమే ఈ మూవీ నుండి ఓ రెండు పాటలను మేకర్స్ విడుదల చేశారు. ఓ వీడియోని కూడా విడుదల చేశారు. కొన్ని పోస్టర్లను కూడా విడుదల చేశారు. ఆ తర్వాత అనూహ్యంగా ఈ సినిమాను ఆగస్టు 15 వ తేదీన కాకుండా డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దానితో ఈ మూవీ యూనిట్ ప్రచారాలను పెద్దగా చేయలేదు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాను డిసెంబర్ 6 వ తేదీన కాకుండా అంతకు ఒక రోజు ముందు అనగా డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ మూవీ బృందం ఆగస్టు 15 వ తేదీకి విడుదల అనే విధంగా ప్రచారాలను చేస్తూ రావడంతో చాలా పాటలను , ప్రచార చిత్రాలను విడుదల చేసింది.

ఇక ఈ మూవీ బృందం ఈ మధ్యకాలంలో పెద్దగా అప్డేట్లను విడుదల చేయడం లేదు. దానితో చాలా మంది ఈ మూవీ మేకర్స్ ముందే ప్రచార చిత్రాలను వేగంగా చేశారు. ప్రస్తుతం ఎక్కువ కంటెంట్ విడుదల చేయద్దు అనే ఉద్దేశంతోనే చాలా సైలెంట్ గా ఉంటున్నారు. మరికొన్ని రోజుల్లోనే ప్రచారాలు మొదలవుతాయి అనే వాదనను వినిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: