తస్సాదియ ఏ మందం.. ఉదయ్ కిరణ్ హీరోయిన్ లుక్కు చూస్తే ఇప్పుడు మైండ్ బ్లాంకే..!
ఇక అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ప్రేక్షకుల్లో ఆమె పేరు మారుమోగిపోయింది. ఇక తన అందం అభినయంతో అప్పటి కుర్రాళ్లను మైమరిపింపచేసింది . గతంలో ఉదయ్ కిరణ్ - అనిత కాంబో సినిమాలో ఎంతో క్యూట్ గా ఆకట్టుకుంది. అలాగే నువ్వు నేను తర్వాత తెలుగులో అనితకి వరుసగా మంచి అవకాశాలే వచ్చాయి.శ్రీరామ్ , తొట్టి గ్యాంగ్ , నిన్నే ఇష్టపడతాను వంటి వరుస సినిమాలో నటించి అదరగొట్టింది. అయితే కానీ ఆ తర్వాత ఈమెకు అవకాశాలు సరిగ్గా రాకపోవడంతో బాలీవుడ్ కి వెళ్ళిపోయింది అనిత. అక్కడే వరస సినిమాలు, సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంటుంది .
ఇక 2013లో గోవా కార్పొరేట్ ప్రొఫెషనల్ రోహిత్ రెడ్డిని పెళ్లి చేసుకున్న అనిత ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పింది. ఇక ప్రస్తుతం తన ఫ్యామిలీ లైఫ్ లో హ్యాపీగా గడుపుతుంది. అదేవిధంగా హిందీలో పలు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా కొనసాగుతుంది. అలాగే ఇప్పుడిప్పుడే తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది అనిత. సుహాస్ నటిస్తోన్న ఓ ప్రాజెక్టులో కీలకపాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఏజ్ 44 సంవత్సరాలు. ఇప్పటికీ చెక్కుచెదరని అందం తో మంత్రముగ్దులను చేస్తుంది. ఈమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మరాయి.