గోపీచంద్ హీరో గానే కాకుండా చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించాడా.. ఆ సినిమా ఏమిటంటే..!
ఇక ఇదంతా పక్కన పడితే గోపీచంద్ గురించి ఎవరికీ తెలియని పలు ఇంట్రెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈయన ప్రముఖ సీనియర్ దర్శకుడు టీ. కృష్ణ కొడుకు అనే విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లోనే ఈయన నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం, వందేమాతరం, ప్రతిఘటన, అర్ధరాత్రి స్వతంత్రం, రేపటి పౌరులు వంటి ఎన్నో గొప్ప చిత్రాలను తేరకేక్కించాడు. వీటిలో ఎక్కువ శాతం ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమాలే ఉన్నాయి. అయితే ఆయన చేసిన తక్కువ సినిమాల అయినప్పటికీ నూటికి నూరు శాతం సక్సెస్ రేట్ తో ఇండస్ట్రీలోకి దూసుకు వచ్చారు టి కృష్ణ.. అయితే ఎవరూ ఊహించడ విధంగా ఆయన కేవలం 36 ఏళ్ల వయసులోనే అనారోగ్యంతో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. చిన్నతన్నంలోనే తండ్రిని కోల్పోయిన గోపీచంద్ ఆర్థికంగా వాళ్ళు కుటుంబం ఎన్నో కష్టాలు పడిందని ఆయన ఎన్నో ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చారు.
అయితే ఇప్పుడు గోపీచంద్ చిన్నవయసులోనేే ఓ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు అనే విషయం చాలా మందికి తెలియదు. ఆయన తండ్రి దర్శకత్వంలో వచ్చిన దేశంలో దొంగలు పడ్డారు అనే సినిమాలో ఓ చిన్న పాత్రలో గోపీచంద్ కనిపిస్తాడు. అలాగే ఆయన తెర్కక్కించిన రేపటి పౌరులు అనే సినిమాలో కూడా గోపీచంద్ ని నటింప చేయాలని అనుకున్నాడట. ఈ సినిమా చిన్నపిల్లల మీద తీసిన సినిమా అని తెలిసిందే. అయితే డేట్స్ ఎక్కువ కావాల్సి ఉండటంతో గోపీచంద్ చదువుకు ఆటంకం కలిగే పరిస్థితి ఉన్నందున ఆ ఆలోచన విరమించుకున్నారు టి కృష్ణ. ఇలా చిన్నతనంలోనే గోపీచంద్ చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్‌లో అడుగు పెట్టారు అనే విషయం ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.