నక్క తోక తొక్కిన సంయుక్త మీనన్.. కుళ్ళుకుని చచ్చిపోతున్న మిగతా హీరోయిన్స్..!

Thota Jaya Madhuri
ఒక స్టార్ హీరో మరొక స్టార్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవడం సర్వసాధారణ విషయమే . ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో అలాంటివి  ఎన్నో చూసాం. స్టార్ హీరో హీరోయిన్ ఒక సినిమాకి వర్క్ చేస్తున్న మూమెంట్లో ప్రేమలో పడడం.. ఆ తర్వాత కొన్నాళ్లు డేటింగ్ చేయడం.. ఫైనల్లీ పెళ్లి చేసుకోవడం ..ఆ ప్రేమ నిజమైనది అయితే కంటిన్యూ అవుతుంది. డమ్మీ ప్రేమ అయితే బ్రేకప్ అవుతుంది . చాలామంది బ్రేకప్ లు చెప్పేసుకుని రెండో పెళ్లి కూడా చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో అలాంటి వార్తలు మనం ఎన్ని వింటున్నామో తెలుసు కదా. 


అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది . అందాల ముద్దుగుమ్మ మలయాళ బ్యూటీగా బాగా పాపులారిటీ సంపాదించుకున్న చక్కని హీరోయిన్ సంయుక్త మీనన్ కు ఒక స్టార్ హీరో ప్రపోజ్ చేశాడు అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది. ఆ స్టార్ హీరో మరి ఎవరో కాదు సాయిధర్మతేజ్ . మెగాస్టార్ చిరంజీవి అండ చూసుకుని ఇండస్ట్రీలోకి వచ్చిన సాయిధరమ్ తేజ్.. పెళ్లి వార్త ఈ మధ్యకాలంలో బాగా వైరల్ గా మారింది .


అప్పట్లో "తిక్క" మూవీ హీరోయిన్ ని ప్రేమిస్తున్నాడు అని పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు అంటూ బాగా ప్రచారం జరిగింది . కానీ ఫారిన్ బ్యూటీని ఇంటికోడలుగా యాక్సెప్ట్ చేసే ఆలోచన సాయి ధరంతేజ్ తల్లికి లేదట . ఆ కారణంగానే ఆమెను వదిలేసుకున్నాడు సాయిధరమ్ తేజ్ అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది . అదే మూమెంట్లో సాయిధరమ్ తేజ్ విరుపాక్ష సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్స్ లో సాయిధరమ్ తేజ్ అదే విధంగా సంయుక్త మీనన్ నడుచుకున్న పద్ధతి అందరికి షాకింగ్ గా అనిపించింది .


అంతేకాదు వీళ్లిద్దరూ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా బాగా పండింది. మరి ముఖ్యంగా సినిమాలో కొన్ని రొమాంటిక్ సీన్స్ వీళ్ల మధ్య ప్రేమ ఉంది అనేలా బాగా హైలెట్ అయ్యాయి . అంతేకాకుండా పలు ఈవెంట్స్ లో కూడా వీళ్ళిద్దరూ చనువుగా మాట్లాడడం  చూసి సాయిధరమ్ తేజ్ - సంయుక్త పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ప్రచారం జరిగింది.  అంతేకాదు సాయిధరమ్ తేజ్ - సంయుక్త మీనన్ కి ప్రపోజ్ కూడా చేశాడు అంటూ బాగా వార్తలు వినిపించాయి. అప్పట్లో ఆ న్యూస్ విని స్టార్ బ్యూటీస్ కూడా కుళ్లు కున్నారు. అయితే సంయుక్త మీనన్ ఆల్రెడీ ఒక మలయాళీ హీరోతో ప్రేమాయణం కొనసాగిస్తుందట. ఆమె ఇండస్ట్రీ లోకి రాకముందు నుంచి కూడా ఆ హీరోతో ప్రేమాయణం నడుపుతుందట. ఆ కారణంగానే సాయిధరమ్ తేజ్ కి  నో చెప్పిందట . ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా ట్రెండ్ అయ్యి సాయి ధరంతేజ్ పేరుని బాగా ట్రోలింగ్ కి గురయ్యేలా చేసింది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: