కొంత మంది దశాబ్దాలు గడుస్తోన్న ప్రేక్షకుల గుండెల్లో మాత్రం ఇప్పటికీ అలానే కొలువై ఉంటారు. అలాంటి అరుదైన నటీమణుల్లో దివ్య భారతి ఒకరు. తెలుగు , దక్షిణాది సహా ఉత్తరాదిని జయప్రద, శ్రీదేవి తర్వాత ఆ రేంజ్‌లో ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటిన భామ దివ్య భారతి. చిన్న వయసులోనే ఊహించని స్టార్ డమ్.అప్పటికే తెలుగులో నాగార్జున తప్పించి మిగిలిన అగ్రహీరోలతో నటించిన అగ్ర స్థానానికి చేరింది. అలాంటి భామ ఆకస్మాత్తుగా కన్నుమూయడం అప్పట్లో చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని చెప్పాలి.దివ్యభారతి తెలుగులో ‘బొబ్బిలి రాజా, అసెంబ్లీ రౌడీ, రౌడీ అల్లుడు, చిట్టెమ్మ మొగుడు, ధర్మక్షేత్రం, తొలిముద్దు తెలుగులో అర డజను చిత్రాల్లో నటింది. ఈమె టాలీవుడ్‌లో చివరి చిత్రం ‘తొలి ముద్దు’. ఈమె చనిపోయిన తర్వాత విడుదలైంది. అందులో చివరి సన్నివేశాలను రంభతో షూట్స్ చేశారు.ఇదిలాఉండగా సినిమాల్లో హీరోయిన్ కి సంబంధించిన చాలా సన్నివేశాలు వివాదం అవుతుంటాయి. ఫ్యామిలీలకు ఇబ్బంది కలిగించే సన్నివేశాలు ఉంటే సెన్సార్ వాళ్ళు తప్పకుండా అడ్డు చెప్పడం, కత్తెర్లు వేయడం చేస్తారు. ఒకప్పుడు హీరోయిన్లు గ్లామర్ షో అంటే హద్దుల్లో ఉండేవారు. నగ్మ, రమ్యకృష్ణ లాంటి హీరోయిన్లు మాత్రం స్కిన్ షో ఎక్కువగా చేసేవారు.అప్పట్లో దివ్య భారతి చిత్రాల్లో గ్లామర్ కనిపించడం, కొన్ని సన్నివేశాల్లో నటించడంపై పెద్ద చర్చే జరిగింది.
బొబ్బిలి రాజా చిత్రంలో జాకెట్ సన్నివేశం ఉంటుంది. అసలు ఆ సన్నివేశాన్ని అప్పట్లో సెన్సార్ వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు అని అంతా షాక్ అయ్యారు. అసెంబ్లీ రౌడీ చిత్రంలో దివ్య భారతి బాత్రూం సన్నివేశంపై కూడా పెద్ద రచ్చే జరిగింది. ఈ సన్నివేశాలని సెన్సార్ వాళ్ళు ఎలా అనుమతించారు అనేది పెద్ద మిస్టరీ. ఎట్టకేలకు ఆ సన్నివేశాలు ఓకె కావడం వెనుక ఎవరి ప్రమేయం ఉందో డైరెక్టర్ బి గోపాల్ రివీల్ చేశారు.సెన్సార్ సమస్యలు ఏమైనా ఉంటే రామానాయుడు గారు మేనేజ్ చేసేవాళ్ళు. బొబ్బిలి రాజా చిత్రంలో జాకెట్ సన్నివేశాన్ని రామానాయుడు గారు సెన్సార్ వాళ్ళతో మాట్లాడి మేనేజ్ చేశారు. ఆయన చెబితే ఇక తిరుగులేదు. సెన్సార్ వాళ్ళు ఆయన మాట వినేవారు. అదే విధంగా అసెంబ్లీ రౌడీ చిత్రంలో బాత్రూం సన్నివేశాన్ని మోహన్ బాబు గారు మేనేజ్ చేసినట్లు బి గోపాల్ తెలిపారు.ఇక మొత్తంగా చనిపోయి 3 దశాబ్దాలు దాటుతున్న ఇప్పటికీ ఈమె మరణం ఓ మిస్టరీ. ఏది ఏమైనా చేసింది కొన్ని సినిమాలైన తనదైన యాక్టింగ్, గ్లామర్‌తో భారతీయ చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపేసింది. అంతేకాదు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసింది.