జక్కన్నకు కొత్త తలనొప్పులు.. మహేష్ బాబు ఇలా చేశాడు ఏంటి..?
అయితే ఈ సినిమా కోసం చాలా చాలా కష్టపడుతున్నాడు మహేష్ బాబు. దాదాపు 12 కేజీలకు పైగానే బరువు తగ్గాడు . తన లుక్స్ మొత్తం మార్చేసుకున్నాడు . అయితే జక్కన్న మాత్రం మహేష్ బాబు విషయంలో సాటిస్ ఫాక్షన్ గా లేరు అంటూ ప్రచారం జరుగుతుంది. నిజానికి జక్కన్న తను వర్క్ చేసే సినిమాకి సంబంధించిన హీరో బయట ఎక్కువగా తిరగడానికి ఇష్టపడడు. అంతేకాదు ఆ లుక్ బయటపడిపోతాయేమో అన్న భయం ఎక్కువగా ఉంటుంది . అయితే మహేష్ బాబు విషయంలో కూడా అదే భయపడుతున్నారట .
మహేష్ బాబుని అసలు బయట తిరగొద్దు ..ఆయన లుక్ రివిల్ చేయొద్దు అంటూ ఎన్నో సార్లు చెప్పారట. కానీ మహేష్ బాబు మాత్రం ఆ విషయంలో జక్కన్న రూల్స్ అస్సలు ఫాలో అవ్వడం లేదట . మహేష్ బాబు ఎప్పుడు కూడా ఫ్యామిలీతో బయట తిరగడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు . అది అందరికీ తెలిసిందే . అలా ఫ్యామిలీతో వెకేషన్స్ కి వెళ్లే మూమెంట్ లో ఆయన లుక్స్ బయటపడిపోతున్నాయి . దీనికోసం రాజమౌళి ఎప్పటికప్పుడు రాజమౌళి ..మహేష్ లుక్స్ మార్చుతూనే ఉన్నారు . అయితే తాజాగా ఒక ఆరు నెలల పాటు మహేష్ బాబును మీడియా కంటే కనపడకుండా ఉండేలా ప్లాన్ చేశారట రాజమౌళి .అయితే మహేష్ బాబు మాత్రం జనవరిలో ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేసుకున్నారట. ఆ ట్రిప్ క్యాన్సిల్ చేసే ప్రసక్తే లేదు అంటూ తెల్చి చెప్పేసారట. దీంతో జక్కన్నకు కొత్త తలనొప్పులు స్టార్ట్ అయ్యాయి . మళ్ళి లుక్స్ మార్చాలి అంటూ తెగ బాధ పడిపోతున్నాడట రాజమౌళి..!