ఫ్యాన్స్ కు ఫ్యామిలీతో ఎన్టీఆర్ దీపావళి విషెస్.. రెండు కళ్ళు చాలవు భయ్యా..

Divya
టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ గురించి క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఏదైనా ఫెస్టివల్ జరుగుతోందంటే చాలు తన ఇంట సంబరాలు చాలా సింపుల్ గా రిచ్ లుక్ లో జరుగుతూ ఉంటాయి. నిన్నటి రోజున దీపావళి పండుగ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తన ఇద్దరు పిల్లలతో భార్యతో చాలా సింపుల్ గా దీపావళి పండుగను చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు సైతం సోషల్ మీడియాలో షేర్ చేశారు జూనియర్ ఎన్టీఆర్.

ఈ ఫోటోలను చుస్తే జూనియర్ ఎన్టీఆర్ తన ఇద్దరు అబ్బాయిలకి స్కై బ్లూ కలర్ దుస్తులను వేయగా ఎన్టీఆర్ బ్లాక్ దుస్తులలో టాప్ టు బాటమ్ కనిపిస్తూ ఉన్నారు. ఇక ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి కూడా డ్రెస్లో చాలా సింపుల్ గా కనిపిస్తోంది. తన ఇంటి లోపలి ఈ ఫోటో దిగినట్టుగా కనిపిస్తోంది. ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతోనే దీపాలు విషెస్ చెబుతూ ఉండడంతో అభిమానులు ఈ ఫోటో చూడడానికి రెండు కళ్ళు చాలడం లేదు భయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం చాలా సింప్లీ గానే  స్టైలిష్  ఫ్యామిలీగా కనిపిస్తోందని చెప్పవచ్చు.

ఎన్టీఆర్ సినీ కెరియర్ విషయానికి వస్తే.. దేవర సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా 550 కోట్లకు పైగా కలెక్షన్స్ తో ముందుకు వెళుతున్నట్లు సమాచారం.ప్రస్తుతం బాలీవుడ్ లో వార్-2 సినిమా షూటింగ్లో పాల్గొన్నట్లు ఇటీవలే కొన్ని లీక్స్ వైరల్ గా మారాయి. యష్ రాజ్ ఫిలిం బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. హృతిక్ రోషన్ కి విలన్ గా వార్ -2లో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడ ఒక నెలపాటు సినిమా షూటింగ్ డేట్ లను కూడా కేటాయించినట్లు సమాచారం.ఈ సినిమా అయిపోగానే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా.. దేవర-2 సినిమాని చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: