రివ్యూ: లక్కీ భాస్కర్ తో దుల్కార్ ఖాతాలో మరో హిట్..!
స్టోరీ విషయానికి వస్తే.. భాస్కర్ కుమార్ (దుల్కర్ సల్మాన్) మధ్యతరగతి కుటుంబంలో జీవిస్తూ ఒక బ్యాంకు ఉద్యోగిగా పని చేస్తుంటారు. అలా చాలీచాలని జీవితంతో ముందుకు వెళుతున్న దుల్కర్ సల్మానుకు కుటుంబ భారం పడడంతో తన భార్య సుమతి (మీనాక్షి చౌదరి) తో పాటు కొడుకు తండ్రి చెల్లి తమ్ముడు ఇలా అందరి బాధ్యతలు కూడా తన మీదే ఉండడంతో.. బ్యాంకుతోపాటుగా ఇతర చోట్ల కూడా అప్పులు చేస్తూ ఉంటారు. అయితే ప్రమోషన్స్ కోసమే ఎదురుచూస్తున్న భాస్కర్కు ప్రమోషన్ రాకపోవడంతో కుటుంబం కోసం ఎలాంటి రిస్క్ చేసిన తప్పు లేదనుకుంటూ ఉంటారు.. అలా దుల్కర్ సల్మాన్ చేసిన రిస్క్ ఏంటి ?అతడికి ఎదురైన ఇబ్బందులు ఏంటి? అనే విషయం మిగతా కథ.
చాలా రోజుల తర్వాత తెలుగు తెరపైన ఒక సరికొత్త సినిమాని చూసామని ప్రేక్షకులు తెలుపుతున్నారు.. అలాగే బ్యాంకింగ్ వ్యవస్థ స్టాక్ మార్కెట్ మధ్యతరగతి మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుందనే విషయాన్ని డైరెక్టర్ బాగా చూపించారు.1990 లో భారతీయ ఆర్థిక వ్యవస్థను సైతం కుదిపేసిన హర్షద్ మహత్ కుంభకోణం ఈ కథలో చాలా క్లియర్ గా చూపించారట. సాధారణ ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా ఉన్నదని. ఇందులోని కొన్ని సన్నివేశాలు కథను మలుపు తిప్పుతాయని ప్రేక్షకులను థ్రిల్ గురైలా చేస్తాయని తెలుపుతున్న. రెండవ భాగం కూడా మరింత ఆకట్టుకున్న కొన్నిచోట్ల సాగదీత కనిపిస్తోందని తెలిపారు.
దుల్కర్ సల్మాన్ ఈ సినిమా మొత్తాన్ని తన భుజాల మీదే మోసారని ప్రతిపాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నదట. మీనాక్షి చౌదరికి కూడా హీరోయిన్గా గుర్తుండిపోయే పాత్రలలో ఇది ఒకటి అని ఎన్నో బాగోదు వేగమైన సన్నివేశాలతో చూపించారని తెలుపుతోంది.
ఈ సినిమాకి ప్లస్ పాయింట్లు వస్తే . కథ నేపద్యం, దుల్కర్ సల్మాన్ నటన, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కథలో మలుపులు.
మైనస్ విషయానికి వస్తే రెండవ భాగంలో కొన్ని సన్నివేశాలు. మొత్తానికి దుల్కర్ భాస్కర్ సక్సెస్ కొట్టారని తెలియజేస్తున్నారు.