సినిమా ఇండస్ట్రీలో ఒక్కో హీరోకు ఒక్కో రకమైన ఈమేజ్ ఉంటుంది. ఇక ఒక కథను ఒక హీరోతో చేయాలి అనుకున్నప్పుడు ఒక రకంగా కథ ఉంటే మరొక హీరోతో ఆ కథను రూపొందించాలి అనుకున్నప్పుడు ఆ హీరో ఈమేజ్ కి తగ్గట్టు కథలో కొన్ని మార్పులు , చేర్పులు చేయవలసి ఉంటుంది. కొన్ని సందర్భాలలో హీరో మారినప్పుడు కథ పెద్ద ఎత్తున మార్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం నందమూరి నట సింహం బాలకృష్ణ కోసం రాజమౌళి తండ్రి అయినటువంటి విజయేంద్రప్రసాద్ ఓ కథను తయారు చేశాడట.
ఇక కథ మొత్తం తయారు అయ్యాక దానిని బాలకృష్ణకు వినిపించగా ఆయన స్టోరీ మొత్తం విని ఇది వరకు నేను ఇలాంటి స్టోరీతో చాలా సినిమాలు చేశాను. మళ్లీ ఇలాంటి కథతో సినిమా చేస్తే అది హిట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. అందుకే ఆ స్టోరీ వద్దు అని చెప్పాడట. ఇలా విజయేంద్ర ప్రసాద్ , బాలకృష్ణ కు వివరించిన కథలో మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఉండేవారట. ఇక బాలకృష్ణ రిజెక్ట్ చేయడంతో ఆ కథను విజయేంద్ర ప్రసాద్ పక్కన పెట్టేసాదట. ఇక రాజమౌళి దర్శకుడు అయిన తర్వాత ఆ కథ తనకు ఎంతో నచ్చడంతో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దానిని సింహాద్రి అనే టైటిల్ తో రూపొందించినట్లు తెలుస్తోంది.
ఇకపోతే బాలకృష్ణ కోసం ఈ కథలో ముగ్గురు హీరోయిన్ల పాత్రలను డిజైన్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ ను హీరోగా అనుకున్న తర్వాత అందులో నుండి ఒక పాత్రను తీసేసి కేవలం ఇద్దరు హీరోయిన్లతోనే ఈ మూవీని రూపొందించారట. అలా బాలకృష్ణ కోసం ముగ్గురు హీరోయిన్లను అనుకోగా ఎన్టీఆర్ ను హీరోగా అనుకున్న తర్వాత అందులో నుండి ఒక హీరోయిన్ పాత్రను మొత్తంగా తీసేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే సింహాద్రి సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది.