దాదాపుగా ప్రతి సినిమాలోను విలన్ పాత్రలు ఉంటూ ఉంటాయి. కానీ చాలా వరకు హీరో పాత్రల ముందు విలన్ పాత్రలో తేలిపోతూ ఉంటాయి. అలా తేలిపోయే విధంగానే చాలా మంది కథ రచయితలు విలన్ పాత్రలను రాస్తారు అని కొంతమంది అభిప్రాయం. ఎందుకు అంటే హీరో పాత్రాల కంటే విలన్ పాత్రలు స్ట్రాంగ్ గా ఉంటే సినిమాలు ఎక్కడ ప్రేక్షకులకు నచ్చవో అని , స్టార్ హీరోల సినిమాలలో దాదాపుగా హీరో పాత్రాల కంటే విలన్ పాత్రలు తేలిపోయే విధంగా లేనట్లయితే ఆ హీరోలా అభిమానులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో అనే అనుమానంతో కూడా దర్శకులు హీరో పాత్ర కంటే విలన్ పాత్రలని చాలా తేలికగా చూపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని కూడా కొంతమంది జనాలు అభిప్రాయ పడుతూ ఉంటారు.
కానీ కొన్ని కొన్ని సినిమాలలో మాత్రం హీరో పాత్రల కంటే విలన్ పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటూ ఉంటుంది. అలాంటి సినిమాలకు ఒక ప్రత్యేక స్థానం కూడా ఉంటుంది. ఇక అలాంటి సినిమాలలో సెవెన్త్ సెన్స్ ఒకటి. సూర్య హీరోగా రూపొందిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటించగా ... మురుగదాస్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో విలన్ పాత్రలో జాని నటించాడు. ఇక జానీ ఈ సినిమాలో డాంగ్లీ అనే పాత్రలో కనిపించాడు. ఈ సినిమాలో ఈయన విపనిజంకి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.
కళ్ళతో ఇప్నటైజ్ చేస్తూ ఎవరితోనైనా ఏ పనైనా చేయించుకునే టాలెంట్ కలిగిన పాత్రలో జానీ ఈ మూవీ లో కనిపించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాలో కొన్ని సందర్భాలలో సూర్య ను ఈజీగా డోంగ్లి పాత్ర దాటిస్తోంది. దానితో ఈయన పాత్రకు అద్భుతమైన గుర్తింపు లభించింది. అలా జానీ "సెవెన్త్ సెన్స్" సినిమాలో తన విలనిజంతో ప్రేక్షకులను కట్టిపడేశాడు.