ఒకప్పటి హీరో అబ్బాస్ కూతురు భలే ఉంది బాసు.. తన అందంతో స్టార్ హీరోయిన్స్ నే మరిపించిందిగా..!
అలాగే నీ ప్రేమకై, నితిన్ హీరోగా వచ్చిన మారో సినిమాల్లో విలన్ గా కూడా చేసి మెప్పించాడు. ఇక అబ్బాస్ తెలుగు , తమిళ భాషల్లో 50కు పైగా సినిమాల్లో నటించాడు. అయితే మధ్యలో ఉన్నట్టుండి సినిమాలుకు దూరమైపోయాడు. 2011లో వచ్చిన మారో సినిమా తర్వాత ఏ తెలుగు సినిమాలను కనిపించలేదు అబ్బాస్. మద్యలో కేవలం పలు కమర్షియల్ యాడ్స్ లోనే అప్పుడప్పుడు కనిపించాడు. సినిమాలకు దూరంగా ఉన్న అబ్బాస్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి న్యూజిలాండ్ లో సెటిల్ అయ్యాడు. అయితే రీసెంట్గా ఆయన ఫ్యామిలీ ఆర్థిక సమస్యలు రావడంతో ఈ రీసెంట్ టైమ్స్ లో మెకానిక్ పనులు కూడా ఆయన చేసినట్లు చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం అబ్బాస్ తన లైఫ్ లో మోటివేషనల్ స్పీకర్‌గా, సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ రీసెంట్గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో అబ్బాస్ కంటెస్టెంట్ గా వస్తాడని వార్తలు కూడా బయటకు వచ్చాయి .. అందులో ఏ మాత్రం నిజం లేదని కూడా తేలిపోయింది. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే.. అబ్బాస్ 1997లో ఏరూమ్ అలి అనే మహిళను వివాహం చేసుకున్నారు. వీరికి కూతురు ఏమిరా అలి, కొడుకు అయమాన్ అలి ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అబ్బాస్ అప్పుడప్పుడూ తన ఫ్యామిలీ ఫొటోలను అందులో షేర్ చేస్తుంటాడు. అబ్బాస్ లాగే అతని కూతురు, కొడుకు కూడా ఎంతో అందంగా ఉంటారు. ముఖ్యంగా కూతురు ఏమిరా అలి అందంలో స్టార్ హీరోయిన్స్ కు ఈ మాత్రం తీసిపోదు. ఆమెను చూసిన నెటిజన్లు సినిమాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. ఇక మరి రాబోయే రోజులైనా అబ్బాస్ కూతురు హీరోయిన్ గా చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతుందో లేదో చూడాలి.