అప్పు తీర్చడం కోసం హీరోగా మారిన సూర్య !
ఈమూవీని ప్రమోట్ చేస్తూ అనేక మీడియా సంస్థలకు సూర్య ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. లేటెస్ట్ గా ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్య తాను హీరోగా మారడం వెనుకగల అసలు విషయాన్ని బయటపెట్టాడు. తాను చేసిన అప్పు తీర్చడం కోసం తాను అనుకోకుండా హీరోగా మారిన విషయాన్ని బయటపెట్టాడు.
మొదట్లో తనకు సినిమాలలో నటించాలి అన్న ఆలోచనే లేదనీ తన చదువు పూర్తి అయిన తరువాత ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నప్పుడు తనకు అప్పట్లో నెలకు 800 వందల రూపాయల జీతం వచ్చేదని చెపుతూ ఆజీతం తన ఖర్చులకు సరిపోకపోవడంతో అప్పులు చేయడం మొదలుపెట్టిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు.
అయితే ఆ అప్పులు పెరిగి 25 వేలవరకు అయిపోవడంతో ఆఅప్పులు ఎలా తీర్చాలో తెలియక భయపడి తన తండ్రి తమిళ శివ కుమార్ ను అడిగితే ఆయన విపరీతంగా తిట్టడంతో ఏమిచేయాలో తెలియక తన అప్పులు గురించి విపరీతంగా భయపడిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. అలాంటి పరిస్థితులలో తన తండ్రి వద్దకు వచ్చిన ఒక నిర్మాత సినిమాలలో నటిస్తావా అని అడిగితే 25 వేలు పారితోషికం ఇస్తే నటిస్తానని చెప్పి తన మొదటి సినిమాను చేసిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. అంతేకాదు తాను నటుడిగా స్థిరపడిపోవాలని హీరోగా ఎదిగిపోవాలని సినిమాల్లోకి రాలేదని అంటూ అనుకోకుండా 25 వేల అప్పుకోశం తాను హీరో అయిన అసలు విషయాన్ని బయటపెట్టాడు..