పక్క స్టేట్ హీరోకు ఇక్కడ రికార్డ్స్.. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే అన్ని కలెక్షన్లను లాగేసిన లక్కీ భాస్కర్..?

Pulgam Srinivas
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈయన ఇప్పటివరకు ఎన్నో మలయాళ సినిమాల లో నటించి అందులో చాలా మూవీలలో మంచి విజయాలను అందుకొని మలయాళ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు . ఈ మధ్య కాలంలో ఈయన వరస పెట్టి తెలుగు సినిమాల్లో నటించడానికి అత్యంత ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నాడు . అందులో భాగంగా కొంత కాలం క్రితం మహానటి అనే సినిమాలో కీలక పాత్రలో నటించిన ఈయన ఆ మూవీ తో మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఇక కొంత కాలం క్రితం ఈయన సీత రామం అనే సినిమాలో హీరో పాత్రలో నటించాడు. ఈ మూవీ ద్వారా ఈయనకు తెలుగులో అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇకపోతే తాజాగా ఈ నటుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో లక్కీ భాస్కర్ అనే మరో తెలుగు సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని సూర్య దేవర నాగ వంశీ నిర్మించగా ... జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించగా ... ఈ మూవీ ని అక్టోబర్ 31 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఓపెన్ అయ్యాయి.

ఇకపోతే పక్క స్టేట్ హీరో అయిన కూడా దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన లక్కీ భాస్కర్ సినిమా అడ్వాన్స్ బుకింగ్లకి తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభిస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా దుల్కర్ సల్మాన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రేంజ్ ఇంపాక్ట్ ను చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: