అసలు బాలయ్య బాబాయ్ తోనే కాదు.. ఆయనతో సినిమా చేస్తా ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్..!

Amruth kumar
ప్రస్తుతం టాలీవుడ్ లో వ‌రుస విజ‌య‌ల‌తో దూసుకోబోతున్న హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. ఇప్పటికే వరుస ఆరు బ్లాక్ బాస్టర్ విజయాలతో టాలీవుడ్ లోనే సూపర్ ఫామ్ లో ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోగా మారారు. ఇక రీసెంట్ గా వచ్చిన దేవ‌ర‌ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ ఏంటో ఇండియన్ బాక్స్ ఆఫీస్ కి చూపించాడు. మూవీ యావరేజ్ టాక్ తో కూడా 500 కోట్లకు పైగా భారీ కలెక్షన్లు అందుకుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస క్రేజీ సినిమాలు చేస్తున్నాడు. వాటిలో బాలీవుడ్లో హౄతిక్ రోషన్ తో కలిసి వార్‌ 2 సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాతో బాలీవుడ్లో తన క్రేజ్ ఏంటో చూపించాలని ప్లాన్ చేస్తున్నాడు. అలాగే ప్రశాంత్ నీల్‌తో చేయబోయే తన 31 వ సినిమాతో అదిరిపోయే రికార్డులు క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. ఇలా ఎన్టీఆర్ వరుస‌ క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల‌ ముందుకు రావడానికి రెడీగా ఉన్నాడు. అలాంటి ఎన్టీఆర్ గతంలో తన బాబాయ్ బాలయ్యతో సినిమా చేయడానికి నో  చెప్పారట. అదే సమయంలో తన తండ్రి హరికృష్ణతో సినిమా చేస్తానని చెప్పారట. మరి ఎన్టీఆర్ అలా ఎలా సమాధానం చెప్పాల్సిన అవసరం ఏంటి? అసలు ఏం జరిగింది అనేది చూస్తే ఎన్టీఆర్ గతంలో సీనియర్ హీరోయిన్ జయప్రద వ్యాఖ్యాతగా చేసిన జయప్రదం అని టాక్ షో కి వెళ్ళాడు.

అందులో ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఆయనకు ఎదురైంది ఒకేసారి ఇద్ద‌రు హీరోలతో సినిమా చేయాల్సి వస్తే మీరు ఎవరితో చేస్తారన్న ప్రశ్న జయప్రద అడిగింది . అలాగే ఆప్షన్లగా బాలకృష్ణ - హరికృష్ణ పేర్లు కూడా ఇచ్చింది. దీంతో ఎన్టీఆర్  సింపుల్గా ఆన్సర్ చెప్పేశాడు.. ఇక‌ ఎన్టీఆర్ ఎలాంటి మొహమాటం లేకుండా బాలయ్య బాబాయితో కాకుండా నాన్న హరికృష్ణతో సినిమా చేస్తానని చెప్పాడు. ఎంతైనా నన్ను కన్న తండ్రితో సినిమా చేయటం అనేది ఓ గొప్ప కదా అంటూ క్లారిటీ ఇవ్వటం విశేషం. అయితే అప్పట్లో ఎన్టీఆర్ చెప్పిన మాట బాలయ్య అభిమానులకి బాధ కలిగించిన ఆయన కన్న తండ్రికి ఇచ్చిన ప్రయారిటీ, తనకు తండ్రి పై ఉన్న ప్రేమను తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: