అల్లు vs మెగా: నవంబర్లో మొదలు కాబోతున్న వార్ రచ్చ రచ్చేనా..?

Divya
గేమ్ ఛేంజర్ నటిస్తున్న చిత్రంలో పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.. జరగండి జరగండి అనే పాట కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇక తర్వాత రా అల్లు అర్జున్ నటించిన సినిమా పుష్ప-2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుస ప్రచారాలతో దుమ్ము దులిపేస్తున్నారు. అలా వీళ్ళిద్దరి సినిమాల ప్రచారం ఒకరు ముందు మరొకరు వెనుక అన్నట్టుగా సాగిపోతోంది. అందుకే ఇతర సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా ఇతర సినిమాలు పక్కకు జరగాల్సిందే అంటే పలువురు అభిమానులు తెలియజేస్తున్నారు. అలాగే రామ్ చరణ్ రా మచ్చ రా అనే పాటను కూడా రిలీజ్ చేశారు.

గేమ్ ఛేంజర్ సినిమా విషయానికి వస్తే..RRR సినిమా తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడమే కాకుండా..అభిమానులు ఈ చిత్రం కోసం మూడేళ్లుగా ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా నిర్మాతలు కూడా ఈ చిత్రం రిలీజ్ డేట్లను మార్చి మార్చి చివరికి వచ్చేయేడాది సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు. అందుకే 75 రోజులు కౌంట్ డౌన్ పోస్టు అంటూ ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ రాగా నవంబర్లో మూడవ సాంగ్ రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే డిసెంబర్ నెలలో పూర్తిగా ఫుల్ గ్రౌండ్ లెవెల్ నుంచి అప్డేట్లను విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట.

అలాగే పుష్ప-2 విషయానికి వస్తే పక్కా ప్రమోషన్లతోనే నవంబర్ నెల మొత్తం ప్రమోషన్స్ తోనే నింపేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ నెలలోనే చాలా కీలకంగా పుష్ప-2 సినిమాకి మారనుందట. అలాగే ఈ చిత్రం నుంచి ఒక స్పెషల్ సాంగ్ కూడా ఆ నెలలో విడుదల చేసే విధంగా సిద్ధమవుతున్నారు వీటికి తోడు ట్రైలర్ కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అటు అల్లు ఇటు మెగా హీరోల మధ్య  ప్రమోషన్స్ వార్ కూడా మొదలు కాబోతోంది. మరి ఏ సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని రాబట్టి అభిమానులను ఖుషి చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: