షాక్: నా జీవితంలో ఆ చీకటి రోజులు మర్చిపోలేను.. ఐశ్వర్యారాయ్ సంచలన కామెంట్స్..!
అంతేకాకుండా గత కొద్దిరోజుల క్రితం ఐశ్వర్యారాయ్ ఒక వ్యక్తితో క్లోజ్ గా ఉన్నారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపించాయి.. అది కూడా డాక్టర్ అయిన జిరాక్ మార్కర్ సన్నిహితంగా ఉన్నారని అయితే ఇది స్నేహం మాత్రమే కాదని వేరే రిలేషన్ ఉందని బాలీవుడ్లో ప్రేక్షకులు కూడా చర్చించుకునేలా జరిగింది. కానీ ఈ విషయం పైన ఐశ్వర్యారాయ్ తాను చిన్ననాటి స్నేహితుడు కాబట్టే అలా క్లోజ్ గా ఉన్నామని తెలిపారు. అయితే గత వారంలో మాత్రం ఒక మహిళ నటి వల్లే ఐశ్వర్య అభిషేక్ మధ్య గొడవలు వచ్చాయని వార్తలు వినిపించాయి.
తాజాగా ఇటీవలే అభిషేక్ బచ్చన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడితే తన కష్టసుఖాలలో తన భార్య ఐశ్వర్యరాయ్ తోడుగా ఉంటుందని.. ఎవరైనా తనమీద నెగిటివ్ కామెంట్స్ చేస్తే అసలు ఒప్పుకోదని.. సినీ ఇండస్ట్రీలో ఒత్తిడి ఎక్కువ అయినప్పుడు కచ్చితంగా తను నా వెనకే ఉంటుందని తెలిపారు. అయితే అటు బచ్చన్ సన్నిహితులు మాత్రం ఐశ్వర్య, అభిషేక్ విడిపోతున్నారని విషయాన్ని కొట్టి పారేశారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో ఐశ్వర్యారాయ్ ఇలా ప్రశ్నిస్తూ.. సల్మాన్ ఖాన్ తో ఉన్న బంధాన్ని యాంకర్ అడగగా.. సల్మాన్ ఖాన్ తో రిలేషన్ లో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని మద్యం సేవించి సల్మాన్ ఖాన్ తనమీద చాలా అనుచితంగా ప్రవర్తించే వారిని కూడా అదే తన జీవితంలో చాలా చెత్త దశ అంటూ తెలియజేసిందట. చాలా మానసికంగా శారీరకంగా కూడా వేధించారని ఐశ్వర్య వెల్లడించింది. అందుకే అతనితో విడిపోయినట్లు సమాచారం.