యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా సినిమాకి తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంటూ ముందుకు దూసుకు వెళ్తున్నాడు. కొంత కాలం క్రితం జూనియర్ ఎన్టీఆర్ , రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హీరోగా నటించాడు. భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ అందుకని అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసింది.
ఇక ఆ తర్వాత ఈ సినిమాను జపాన్ లో విడుదల చేయగా ఈ మూవీ జపాన్లో పెద్ద స్థాయి కలెక్షన్లను వసూలు చేసింది. దానితో ఈ సినిమా దాదాపుగా ప్రపంచ వ్యాప్తంగా టోటల్ బాక్సా ఫీస్ రన్ ముగిసే సరికి దాదాపు 1350 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించినట్లు తెలుస్తోంది. అలా ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ కొంత కాలం క్రితమే దేవర పార్ట్ 1 అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమా కూడా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ఇప్పటికే అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసింది. ఇకపోతే ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే ఈ సినిమా 500 కోట్ల కలెక్షన్లను వసూలు చేసినట్టు అధికారికంగా ప్రకటించింది.
ఇక ప్రస్తుతం ఈ మూవీ కి వస్తున్న కలెక్షన్లు చూస్తూ ఉంటే ఈ సినిమా అవలీలగా 650 కోట్ల కలెక్షన్లను సాధించే అవకాశం ఉంది అని కొంత మంది అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే కేవలం రెండు సినిమాలతోనే జూనియర్ ఎన్టీఆర్ 2000 కోట్ల కలెక్షన్లను అందుకున్నట్లు అవుతుంది. ఇక ప్రస్తుతం ఈయన వార్ 2 అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇంత గొప్ప క్రేజ్ ఉన్న హీరో హిందీ సినీ పరిశ్రమను కూడా షేక్ చేస్తాడు అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.