చిరు నిర్ణయాలతో ఇరకాటంలో యంగ్ డైరెక్టర్స్.. అంతమందికి అలాంటి పరిస్థితి..?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సీనియర్ స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మల్లాడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని త్రిష హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... యూవీ క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండగా ... చోటా కె నాయుడు ఈ సినిమాకు సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు. ఈ మూవీ ని కొంత కాలం క్రితం వచ్చే సంవత్సరం జనవరి 10 వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

కానీ ఈ మూవీ విడుదల తేదీన వాయిదా వేశారు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం మే 9 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో చిరంజీవి తన నిర్ణయాలతో కుర్ర డైరెక్టర్లను పెడుతున్నట్లు తెలుస్తోంది. కొంత కాలం క్రితం చిరంజీవి , వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. వెంకీ కుడుముల దర్శకత్వంలో చిరంజీవి సినిమా స్టార్ట్ అవుతుంది అనుకునే లోపే ఈ సినిమా ఊసే లేకుండా పోయింది.

దానితో వెంకీ కుడుముల , నితిన్ హీరోగా రాబిన్ హుడ్ అనే సినిమాను చేస్తున్నాడు. ఇకపోతే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ మూవీ కి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. మళ్ళీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ కాంబో మూవీ కూడా క్యాన్సల్ అయ్యింది. ఇకపోతే ఇప్పటివరకు చిరంజీవి 'విశ్వంభర" మూవీ తర్వాత చేయబోయే సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనలు విడుదల చేయలేదు. ఇకపోతే ప్రస్తుతానికి విశ్వంబర మూవీ పై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: