తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన నటీమణులలో రాశి ఖన్నా ఒకరు. తన అందమైన ముఖం ప్రతిభావంతమైన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమాల్లోకి వచ్చి కొద్దికాలంలోనే స్టార్ హీరోయిన్గా మారింది. చిన్నప్పటి నుంచే నటన పై ఆసక్తి ఉన్న రాశి కాలేజీ రోజుల నుంచే షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. ఆ తరువాత మద్రాస్ కాఫీ అనే హిందీ సినిమాలో చిన్న పాత్ర చేసింది. ఇక రాశి తెలుగు ప్రేక్షకులకు ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో పరిచయం అయ్యింది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి ఆదరణ లభించడంతో ‘తొలిప్రేమ’, ‘సుప్రీం’ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. రాశి ఖన్నా కేవలం అందాల భామగా మాత్రమే కాకుండా విభిన్న పాత్రలను పోషించడంలో కూడా ఆరితేరింది.
కామెడీ, రొమాంటిక్, ఎమోషనల్ అన్ని రకాల పాత్రలను ఈమె అద్భుతంగా పోషించింది. ఇక ఇది కాసేపు పక్కన పెడితే త్రో బ్యాక్ ట్రెండ్ నెట్టింట ఎంత హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. తమ చిన్నప్పటి ఫోటోలను పంచుకుంటూ వాళ్ళ జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటున్నారు. అలాగే ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా తమ చిన్ననాటి తీపి జ్ఞాపకాలను నెట్టింట పంచుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా ఓ హీరోయిన్ తన చైల్డ్ హుడ్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అది ఎవరో కాదు రాశి ఖన్నా స్కూల్ టాప్ వేసుకొని ఉన్న ఫోటోను సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంది. స్కూల్లో టాపర్ తను ఉన్నత చదువులు చదివి ఐఏఎస్ కావాలని ఎన్నెన్నో కలలు కనింది కానీ నటన పై ఆసక్తి ఏర్పడడంతో సినిమా ఇండస్ట్రీకి అడుగు పెట్టింది. కాగా ఇప్పుడు ఈ బ్యూటీ కొన్ని నెలలుగా టాలీవుడ్ కు దూరంగా ఉంటుంది. తెలుగు,తమిళంలో అనేక సినిమాలు నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. హిందీలో వరుస సినిమా ఆఫర్లు అందుకుంటున్న రాశి అటు హిందీలోనూ సినిమాలు చేస్తూ ఇటు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది.
తాజాగా సదరన్ రైజింగ్ సమ్మిట్ లో పాల్గొన్న రాశి తన లైఫ్ లో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటూ తన కెరీర్ గురించి చెప్పింది. ఇలా చెప్పుకొచ్చింది "నా లైఫ్ లో నేను అనుకున్నది ఏదీ జరగలేదు. నేను విధిని మాత్రమే నమ్ముతా. నా లైఫ్ లో నేను కోరుకున్నది ఏది ఇప్పటివరకు నా దగ్గరికి రాలేదు నిజానికి ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్న నా కళ అది జరగలేదు. మధ్యతరగతి కుటుంబాలలో వుండే వారు ఒక మంచి సేఫ్టీ ఉద్యోగం కావాలని కోరుకుంటారు. అలానే నేను కూడా ఐఏఎస్ అయితే రక్షణగా ఉంటుందని అదే చెయ్యాలని ఎన్నో కలలు కన్నాను. ఇకపోతే ఆ సబ్జెక్టులో నేను టాపర్ ని కూడా. కాని ఐఏఎస్ కావాల్సిన నేను హీరోయిన్ అయ్యాను. నటీనటులు కావడం కూడా చాలా కష్టమైన విషయమే. ప్రపంచం మొత్తంలో ఎక్కడ భద్రతలేని జాబ్ ఏదైనా ఉంది అంటే అది నటీనటులు కావడమే". అంటూ చెప్పుకొచ్చింది రాజశేఖర్ అన్న. ప్రస్తుతం తను చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వేరేలవుతున్నాయి.