50 వయసులో కూడా బాలయ్య బ్యూటీ అందాల ఆరబోత..

Anilkumar
90ల దశకంలో బాలీవుడ్‌ను ఏలిన అందాల తార రవీనా టాండన్‌. తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకూ చాలా సన్నిహితం. ఒక మోడల్‌ గా తన కెరీర్‌ ను ప్రారంభించిన రవీనా ఆ తర్వాత సినిమాల్లో అడుగుపెట్టింది. సల్మాన్ ఖాన్‌ తో కలిసి నటించిన ‘పత్థర్ కే ఫూల్’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసింది. తొలి చిత్రంతోనే ప్రేక్షకుల మనసు దోచుకున్న రవీనా వరుస ఆఫర్లతో వెల్లువలా వచ్చాయి. తెలుగు సినిమాల్లోనూ రవీనా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఏ ఎన్నార్, శ్రీకాంత్‌తో కలిసి నటించిన ‘రథసారధి’, బాలకృష్ణతో కలిసి నటించిన ‘బంగారు బుల్లోడు’ వంటి చిత్రాల్లో ఆమె నటన ప్రేక్షకులను అలరించింది.

ఇక బంగారు బుల్లోడు సినిమాలో బాలకృష్ణ తన మేనమామ రామదాసు కు వ్యతిరేకంగా పోటీ పడుతూ ఉంటారు. రామదాసు కుమారైన రాణి బాలకృష్ణను ఎంతగానో ప్రేమిస్తుంది అతని కోసం ఏదైనా చేయడానికి తాను సిద్ధంగా ఉంటుంది. ఆ సమయంలోనే బాలకృష్ణ నగరంలో ఉండే తన మరో బంధువు ప్రియా (రవీనా టాండన్) ను కలుస్తాడు. ఇక తాను ప్రియా ప్రేమలో పడిపోతాడు. ఇది తెలుసుకున్న రాణి ఎంతో కోపంతో ఉంటుంది. రాణి, ప్రియ బాలకృష్ణ ప్రేమ పొందే విషయంలో ఒకరినొకరు సవాలు చేసుకుంటారు. ఇకపోతే ఆ కాలంలోనే ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.  ఇటీవల కేజీఎఫ్ చాప్టర్-2 లో రవీనా టాండన్ నటించింది. అంతేకాకుండా హిందీలో వరుస వెబ్ సిరీస్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రవీనా కొన్ని పెద్ద సినిమా అవకాశాలకు ఓడిసిపడుతుంది.

ఇదిలా ఉంటే మరోవైపు  కుమారై రాషా తడానీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయంపై ఊహాగానాలు రవీనా ను హెడ్ లైన్స్ లో ఉంచుతున్నాయి. అంతేకాకుండా రాష్ట్ర అరంగేట్రం ఎన్బీకే కుమారుడు మోక్షజ్ఞతో ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి మరి ఎంతవరకు నిజమనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే తన కెరీర్‌ లో అనేక అవార్డులు గెలుచుకున్న రవీనా అత్యుత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డుతో సహా రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకుంది. 2023లో ఆమెకు నాల్గవ అత్యున్నత భారతీయ పౌర పురస్కారమైన పద్మశ్రీ లభించింది. వయసు మీరుతున్నా రవీనా అందం, అభినయం మాత్రం మరింత అద్భుతంగా మారుతూనే ఉంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన ఫ్యాన్స్‌తో కనెక్ట్ అవుతూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: