పవన్ కళ్యాణ్ ఆ బ్యానర్‌లో సినిమా చేయకపోవడానికి అసలు కారణం ఇదే..!

Amruth kumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. మన తెలుగు రాష్ట్రాల్లో పవన్ కోసం పడి చచ్చిపోయే అభిమానులు ఉన్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈయన ఎలాంటి హీరో మరొకరు  ఉండరు రారు అనేది కూడా వాస్తవం. ఆయన వ్యక్తిత్వంలో గాని , సినిమాల విషయంలో కానీ , ప్రజలకు సేవ చేయటం లో గాని , ఏ విషయంలో చూసుకున్నా కూడా తనకు తానే పోటీ ... ఈ కారణంగానే ఆయన చేసే ప్రతి సినిమాలు ఏదో ఒక వైవిధ్యాన్ని ప్రేక్షకులను మోటివేట్ చేసే విధంగా ఉండేది . ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా పవన్ తన బాధ్యతలు కొనసాగిస్తున్నారు. అలాగే తను చేయబోయే సినిమాల్ల షూటింగ్లో కూడా పాల్గొంటున్నాడు ప్రస్తుతం ..

అయితే పవన్ కళ్యాణ్ తన కెరీర్ మొదటిలో గీత ఆర్ట్స్ బ్యానర్లు ఎక్కువ సినిమాలు చేశాడు. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఈ బ్యానర్ లో సినిమా చేయడానికి ఇష్టపడటం లేదట. కారణం ఏంటంటే అల్లు అరవింద్ - పవన్ కళ్యాణ్ మధ్య గతంలో కొన్ని విభేదాలు అయితే వచ్చేయని అంటారు. ముఖ్యంగా అల్లు అరవింద్ తనను ఎప్పుడూ డి గ్రేట్ చేస్తూ మాట్లాడేవాడిని పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో తన స్నేహితులతో చెప్పినట్టు తెలుస్తుందిి. నిజానికి అల్లు అరవింద్ వైఖరి పట్ల పవన్ కు తొలి నుంచి కూడా సాఫ్ట్ కార్నర్  అయితే ఉండేది కాదట. కానీ అన్న చిరంజీవి వల్ల పవన్ కళ్యాణ్ తనని బరిస్తూ వచ్చాడని అంటారు .

అయితే ఇప్పుడు వాళ్లకి వీళ్ళకి మధ్య పెద్దగా మాటలు అయితే లేవనే విషయం చాలా స్పష్టంగా ఇప్పుడు అర్థమవుతుంది అల్లు అరవింద్ ఎక్కువ బయట హీరోలతో సినమాలు చేసుకుంటూ ఉంటే మెగా హీరోలు కూడా బయట ప్రొడ్యూసర్ ల‌ తో సినిమాలో చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు ఏది ఏమైనా కూడా తమను తాము స్టార్ హీరోలుగా మార్చుకోవడంలో మెగా హీరోలు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ఇప్పటికే ఈ కుటుంబం నుంచి ముగ్గురు స్టార్ హీరోలు ఉన్నారు . ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజి, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్  సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఇక త్వరలోనే ఈ సినిమాలకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇలా పవన్ పాలిటిక్స్  ఇటు సినిమాలు రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: