నయన్.. అలాంటిదంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటి..!

FARMANULLA SHAIK
స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. చంద్రముఖి చిత్రంతో రజినీకాంత్ సరసన నటించి తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలో ఒకేసారి వరుస ఛాన్సులు దక్కించుకుంది. ముఖ్యంగా తమిళనాట నయనతార క్రేజ్ వేరు. అక్కడ స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటీని సంపాదించుకుందామె. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. గత కొంత కాలంగా డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో చట్టాపట్టాలేసుకొని తిరిగిన ఈ బ్యూటీ ఆ మధ్యపెళ్లి చేసుకున్నారు. అంతే కాదు సరోగసి పద్దతిలో కవల పిల్లను కూడా కన్నారు. కోలీవుడ్ లో క్యూట్ కపుల్ అంటే ఇలా ఉండాలని అనుకునేలా ఫోటోలు, వీడియోలు షేర్ చేసేవారు. ఇటీవల నయనతార ఇన్‌స్టాలోకి అడుగుపెట్టింది. తన భర్త, పిల్లలకు సంబందించిన ఫోటోలు షేర్ చేయడంతో లక్షల మంది లైక్ లు, కామెంట్స్ పెట్టి వారి అభిమానాన్ని చాటుకుంటున్నారు. ప్రస్తుతం ఆమెకు ఇన్ స్ట్రాలో 78 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇదిలావుండగా తాజాగా ఓ సీనియర్ నటి నయన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఆమె ఎవరో కాదు శరణ్య పొన్వన్నమ్.. సీనియర్ నటి శరణ్య ప్రస్తుతం ఇండస్ట్రీలో తల్లి పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన ఆమె ఇప్పుడు సహాయక పాత్రలు చేస్తున్నారు. తన సహజసిద్ధమైన నటనతో ఆమె ప్రేక్షకులను అలరిస్తున్నారు. కాగా ఎప్పుడూ వివాదాలకు దూరంగా శరణ్య తాజాగా నయనతార పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.నటి శరణ్య నయనతార గురించి మాట్లాడిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇందులో ఆమె మాట్లాడుతూ, "నటి నయనతార ఎవరితోనూ మాట్లాడకపోతే చాలా చెడ్డ వ్యక్తి అవుతుంది. ఎందుకంటే నయనతార చాలా స్వీట్ అండ్ జెన్యూన్ పర్సన్. ఆ ప్రత్యర్థిని ఎలా ఎదుర్కోవాలో కూడా ఆమెకు తెలియదు. ఆ మేరకు సమస్య కనిపిస్తే పది అడుగుల దూరం వెళ్తుంది. ఇది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. తమిళ చిత్రసీమలో ఈ స్థాయి నటి పవర్‌ఫుల్‌గా ఉండాలి కానీ ఆమె అలా కాదు, చాలా మెతక మనిషి' అని అన్నారు.ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ ఇలాంటి కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: