సంక్రాంతికి రిలీజ్ అన్నారు.. ఇప్పుడేమో ఈ ట్విస్ట్.. మజాకాతో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడే..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో సందీప్ కిషన్ ఒకరు. ఈయన ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించిన ఆ సినిమాలలో చాలా తక్కువ సినిమాలు మాత్రమే మంచి విజయాలను అందుకున్నాయి. కానీ సందీప్ నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన కూడా ఎప్పుడూ ఈయన రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీలలో నటించకుండా ఎప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ లతో రూపొందే సినిమాల్లో నటిస్తూ రావడంతో నటుడిగా సందీప్ కి మంచి గుర్తింపు ఉంది. ఈయన సినిమాలో హీరో పాత్రలో మాత్రమే కాకుండా ముఖ్య , కీలక పాత్రలలో కూడా నటించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

ఇకపోతే ప్రస్తుతం సందీప్ కిషన్ , త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న మజాకా అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితం ఏ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక సంక్రాంతి పండుగ అంటే స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. ఇప్పటికే అనేక మంది స్టార్ హీరోల సినిమాలు వచ్చే సంవత్సరం సంక్రాంతి బరిలో నిలవడానికి రెడీగా ఉన్నాయి. అంత పోటీలో కూడా ఈ యువ నటుడు సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ కావడంతోనే చాలా మంది షాక్ అయ్యారు.

ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఓ వీడియోని విడుదల చేస్తూ ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్ గా కనిపించబోతుంది అని అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఈ మూవీ బృందం వారు విడుదల చేసిన వీడియోలో రీతూ పెళ్లి కూతురు గెటప్ లో ఉంది. సందీప్ కిషన్ ఆమెను ఆటపట్టిస్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sk

సంబంధిత వార్తలు: