ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో రామ్ గోపాల్ వర్మ ఒకరు. ఈయన నాగార్జున హీరోగా శివ అనే మూవీ తో దర్శకుదిగౌ కెరియర్ను ప్రారంభించాడు. మొదటి మూవీతోనే ఈయనకు బ్లాక్ బస్టర్ విజయం బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కడంతో ఈయనకు సూపర్ సాలిడ్ క్రేజ్ దర్శకుడిగా మొదటి సినిమాతోనే వచ్చేసింది. ఇకపోతే ఆయన ఆ తర్వాత చాలా తక్కువ కాలంలోనే హిందీ సినీ పరిశ్రమపై ఆసక్తిని చూపించడం మొదలు పెట్టాడు. దానితో కొంత కాలానికే హిందీ సినిమాలను తెరకెక్కించిన ఈయన బాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా అనేక విజయాలను అందుకొని అక్కడ అద్భుతమైన స్థాయికి చేరుకున్నాడు.
ఈ మధ్య కాలంలో మాత్రం రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఏ సినిమా విజయాన్ని సాధించలేదు. కనీసం యావరేజ్ విజయాన్ని కూడా అందుకోలేదు. ఇకపోతే కొంత కాలం క్రితం రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర 1 , రక్త చరిత్ర 2 అనే సినిమాలను రూపొందించాడు. ఈ మూవీలు మంచి విజయాలు అందుకున్నాయి. ఇకపోతే రక్త చరిత్ర సినిమాలో వివేక్ ఒబెరాయ్ ఓ కీలకమైన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.
ఈ సినిమాలోని ఈయన నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా ద్వారా వివేక్ ఒబెరాయ్ కి కూడా మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ఈ సినిమాలో ఈయన చేసిన పాత్రకు మొదట జగపతి బాబు ను అనుకున్నారట. కానీ జనాలకు పెద్దగా పరిచయం లేని నటుడు ఉంటే ప్రజలు పాత్రకు చాలా బాగా కనెక్ట్ అవుతారు అనే ఉద్దేశంతో రామ్ గోపాల్ వర్మ , జగపతి బాబు ను కాదు అని చెప్పి వివేక్ ఒబెరాయ్ ను ఈ పాత్రకు తీసుకున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.