కంగువా’ హీరోతో మెగా హీరో ఇంటర్వ్యూ: తెలుగు సినీ ప్రేక్షకులకు పండగే!

Anilkumar
తమిళ సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘కంగువా'. ఎన్నో హిట్ సినిమాలు చేసి అభిమానుల మనసు దోచుకున్నారు ఈ స్టార్ హీరో. ఇకపోతే  భారీ బడ్జెట్‌ తో తెరకెక్కబోతున్న కంగువా చిత్రంపై ప్రేక్షకుల అంచనాలు అంచెలంచెలుగా పెరుగుతున్నాయి.  డైరెక్టర్ శివ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్, ట్రైలర్లు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. కాగా దర్శకుడు శివ ఈ సినిమాలో సూర్య ను మునుపెన్నడు చూడని విధంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.కాగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని ప్రమోట్ చేస్తూ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.  

ఇదిలా ఉంటే ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడంతో పాటుగా తెలుగులోనూ అంతే గ్రాండ్ గా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఇక దానికోసం మేకర్స్ తెలుగు ప్రమోషన్స్ కూడా భారీగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా హీరో అల్లు శిరీష్ తో కలిసి తమిళ హీరో అయిన సూర్య స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఆ ఇంటర్వ్యూలో శిరీష్, సూర్యుని ఎలాంటి ప్రశ్నలు అడిగాడు అని వాటికి సూర్య ఏం సమాధానాలు చెప్పాడు అనేది ఇప్పుడు ప్రేక్షకులకు ఆసక్తిగా మారింది.

 కాగా ఇప్పుడు అభిమానులంతా ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన పూర్తి వీడియో ఎప్పుడు వస్తుందో అని ఎంతో ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే కంగువా సినిమా నవంబర్ 14న గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అయింది. అభిమానులంతా ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సూర్య ఈ సినిమాతో ఎంతటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: