నాగచైతన్య పెళ్లికి.. సమంత బిగ్ షాక్ ఇవ్వడానికి రెడీగా ఉందిగా..!

Amruth kumar
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు.. తెలుగులో ఏం మాయ చేసావే సినిమాతో హీరోయిన్గా అడుగుపెట్టి ఆ తర్వాత వరుస‌ స్టార్ హీరోలతో నటించి టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది . ఆ తర్వాత అన్ని ఇండస్ట్రీలో నటిస్తూ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్గా దూసుకుపోతుంది. అలాంటి సమంత తన తొలి సినిమా హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది.. పెళ్లి తర్వాతా ఈ జంట‌ టాలీవుడ్ లోనే మోస్ట్ రొమాంటిక్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. ఇద్దరూ కలిసి సినిమాల్లో కూడా నటించారు. అయితే అలా మంచిగా వెళ్తున్న క్రమంలో మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుని ఎవరి జీవితం వారు చూసుకుంటున్నారు.

ఇప్పటికి టాలీవుడ్ లో సమంత - నాగచైతన్య విడాకులపై రచ్చ‌ జరుగుతూనే ఉంది. అయితే నాగచైతన్య మాత్రం ఇప్పుడు మరో హీరోయిన్శోభిత ధూళిపాళను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పటికే వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. త్వరలోనే వీరుద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే సమంత మాత్రం విడాకుల తర్వాత ప‌లు ఇబ్బందులు ఎదుర్కొంది. ఎవరు ఊహించిన విధంగా మయోసైటిస్ వ్యాధికి గురైంది.. ఆ తర్వాత సినిమాలు కి కొంత గ్యాప్ ఇచ్చి ఆరోగ్యం సెట్ అయ్యాక మళ్ళీ సినిమాలు చేస్తూ వస్తుంది. ఇప్పుడు ఆమె బాలీవుడ్ లో నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ క్రమంలోనే సమంత వ‌రుస‌ ప్రమోషన్ లో పాల్గొంటుంది.

అయితే గత కొన్ని రోజులుగా సమంత రెండో పెళ్లి చేసుకుంటుంది.. త్వరలోనే తన బాయ్ ఫ్రెండ్‌ను పరిచయం చేయబోతుందని వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఆ వార్త‌లకు సమంత గట్టి కౌంటర్ ఇచ్చింది. తను ఎంతో ఇష్టపడి ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను ప్రస్తుతం విడిపోయిని తన జీవితంలో ఇక రెండో పెళ్లి అనే ప్రసక్తి లేదని. మరో వ్యక్తి గాని ఎవరు ఉండరని కుండా బద్ద‌లు కొట్టి చెప్పింది. అయితే ఇక్కడ మరో వాదన బయటకు వచ్చింది.. సమంత , నాగచైతన్యను ఇంకా ప్రేమిస్తూనే ఉందట.. అతన్ని మర్చిపోలేకే రెండో పెళ్లి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేసిందని కూడా అంటున్నారు. అయితే ఇప్పుడు త్వరలోనే నాగచైతన్య‌ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ సమయంలో సమంత ఇలాంటి వ్యాఖ్యలు చేయటం బట్టి నాగచైతన్యకు ఏమన్నా గట్టి షాక్ ఇవ్వబోతుందా అనే అనుమానాలు బయటికి వస్తున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: