వెంకటేష్ సూపర్ హిట్ మూవీలో లవ్ స్టోరీ నాదే .. జూనియర్ చిరంజీవి హాట్ కామెంట్స్ వైరల్..!
అయితే ఈ సినిమా తన లవ్ స్టోరీ అని సీనియర్ నటుడు జూనియర్ చిరంజీవి రాజ్ కుమార్ వెల్లడించారు. బుల్లితెరపై వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాజ్ కుమార్. ఒకప్పుడు ఎన్నో సీరియల్స్ లో ఎన్నో సినిమాలు నటించి మెప్పించారు.. ఇప్పటి వారికి పెద్దగా తెలుగు పోవచ్చు కానీ 90 లలో వెండితెరపై ఈయన అలరించారు... హీరో గానే కాకుండా విలన్ పాత్రలో కూడా నటించారు. అయితే రాజ్ కుమార్ అప్పట్లో చిరంజీవి డూప్ గా నటించేవారు. అందుకే ఆయన్ని జూనియర్ చిరంజీవి అని కూడా అంటారు. గత కొంతకాలంగా తెలుగు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. అలాగే కన్నడలో వరుస సీరియల్స్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజ్ కుమార్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
అందులో మీ ప్రేమ కథ నే ప్రేమించుకుందా రా సినిమాగా తీశారంట కదా అని యాంకర్ అడగగా.. అవును అది నా లవ్ స్టోరీ నే అని అస్సలు విషయం చెప్పకు వచ్చారు రాజ్ కుమార్. ఈ సినిమా కంటే ముందు హైదరాబాద్లో షిఫ్ట్ ల ప్రకారం పని చేసుకుంటూ బిజీగా ఉండేవాడిని .. కానీ ఆ సినిమా తన లవ్ స్టోరీ అని తెలిసాక ఇండస్ట్రీలో పెద్ద సెన్సేషన్ అయిందని అన్నారు. ఆ సినిమా దర్శకుడు తో మాట్లాడుతూ అసలు ప్రేమించుకుందాం రా స్టోరీని నీదేనయ్యా అని ఆయన అన్నారని.. సినిమా స్టార్టింగ్ లో ఉన్న లవ్ సీన్స్ నిజ జీవితంలో జరిగినవే అని ఎలా అల్లరి చేశాము.. ఎలా కలిసాం అన్నది మొత్తం చూపించారని చెప్పుకొచ్చారు రాజ్ కుమార్.. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాకయలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.