దేవుడు కొడుకు దేవుడే అయినప్పుడు..పవర్ స్టార్ కొడుకు పవర్ బ్యాంక్ కాకూడదా..?

Thota Jaya Madhuri
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో నెంబర్ 1 ట్రెండ్ అయ్యే టాపిక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . అటు మంచి చేసిన ఇటు చెడు చేయకపోయినా కూడా పవన్ కళ్యాణ్ పేరుని ఎప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది ట్రోల్ చేస్తూనే ఉంటారు . దానికి కారణాలు వాళ్లకే తెలియాలి . అయితే పవన్ కళ్యాణ్ హేట్ చేసే వ్యక్తుల కన్నా ప్రేమించే వ్యక్తులే ఎక్కువ. ఎంతలా అంటే ఇంట్లోని చిన్న పాప దగ్గర నుంచి మంచంలో ఉన్న పండు ముసలి వాళ్ళ వరకు పవన్ కళ్యాణ్ ని ప్రత్యేకంగా అభిమానిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. ఏదో సినిమా ఇండస్ట్రీలో పెద్ద స్టార్ అని కాదు ప్రజలకు సేవ చేయడానికి ఎంతో కష్టపడుతున్నాడు అని కూడా కొంతమంది ఆయనను బాగా అభిమానిస్తూ ఉంటారు.


అయితే పవన్ కళ్యాణ్ పొలిటికల్ పరంగా వేలు పెట్టినప్పటి నుంచి అఖీరానందన్ పేరు సినిమా ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది.  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థానాన్ని రీప్లేస్ చేయాలి అంటే అది కేవలం ఆయన కొడుకు అక్కిరానందన్ కి మాత్రమే సాధ్యమవుతుంది అంటూ చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు . అయితే పవన్ కళ్యాణ్ కొడుకు సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇస్తాడా ..? లేదా..? అన్నది పెద్ద డౌటే.  అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేతుల్లో మాత్రమే కాదు రేణు దేశాయ్ చేతుల్లో కూడా ఉంది . అయితే ఎప్పటికప్పుడు రేణు దేశాయ్ అకీరానందన్ ఇండస్ట్రీలోకి రావడం ఇష్టం లేదు అన్నట్లు చెబుతూ వచ్చింది .


కాగా రీసెంట్గా ఓ జీ సినిమా షూట్ లో పవన్ కళ్యాణ్ కొడుకు అకీరానందన్ కూడా పాల్గొన్నారు. దీంతో సోషల్ మీడియాలో కాబోయే పవర్ స్టార్ అకీరానందన్ అంటూ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్ చేయడం ప్రారంభించారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ . అప్పుడే పవన్ కళ్యాణ్ హేటర్స్ కి మండిపోయింది . పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అయితే పవన్ కళ్యాణ్ కొడుకు కూడా పవర్ స్టార్ అవుతాడా..? అంటూ దారుణంగా ట్రోలింగ్ స్టార్ట్ చేశారు .


వీళ్ళకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఘాటుగా రిప్లై ఇస్తున్నారు. దేవుడు కొడుకు దేవుడే అయినప్పుడు పవర్ స్టార్ కొడుకు పవర్ స్టార్ కాకూడదా..? మా అఖీరానందన్ పవర్ బ్యాంక్ కూడా అంటూ రైమింగ్ తో టైమింగ్ తో అదరగొట్టేస్తున్నారు . పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కడ తగ్గేలా లేరు. అఖీరా ఎంట్రీ ఇవ్వగానే పాన్ ఇండియా స్టార్ గా మార్చేసి ఫస్ట్ సినిమాతోనే వంద కోట్లు కలెక్ట్ చేసిన హీరోగా రికార్డులు క్రియేట్ చేస్తారు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: