గోదావరి సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ గుర్తుందా? 40 ప్లస్ లో కూడా అల్లాడిస్తుందిగా.!

Amruth kumar
మన తెలుగు చిత్ర పరిశ్రమలో యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ సినిమాలకు డైరెక్టర్ శేఖర్ కమ్ముల పెట్టింది పేరు.. ఆయన సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలను , పాత్రలను తీర్చిదిద్దడంలో ఆయన ఎక్స్పెక్ట్. ఆయన తెరకెక్కించిన అందమైన అద్భుతమైన సినిమాల్లో గోదావరి అప్పట్లో మంచి విజయం సాధించింది. 2006 మే 19న విడుదలై ప్రేక్షకుల దగ్గర నుంచి మంచి స్పందన అందుకుంది. ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా సుమంత్, కమలినీ ముఖర్జీ నటించారు. అయితే ఈ సినిమాలో సుమంత్ మరదలుగా పల్లెటూరి అమ్మాయి పాత్రలో మరో హీరోయిన్ కూడా నటించింది. అయితే ఇప్పుడు ఆమె ఎలా ఉంది ఏం చేస్తుంది అనే విషయాలు ఇక్కడ చూద్దాం.

ఆ ముద్దుగుమ్మ పేరు  'నీతూ చంద్ర'.. ఇక ఈ బ్యూటీ 1984 జూన్ 24న బీహార్ లో పుట్టింది.. అక్కడే తన చదువును కూడా పూర్తి చేసిన నీతూ .. సినిమాలపై ఆస్తితో మోడలింగ్ పై అడుగులు వేసింది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ టాలీవుడ్ లోనే జరిగింది . 2003 లో విడుదలైన విష్ణువు అనే మూవీలో ఈమె నటించింది. ఆ తర్వాత 2005లో గరం మసాల అనే సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు సినిమాలతో ముద్దుగుమ్మ డైరెక్టర్ల దృష్టిలో పడింది. అలా 2006లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన గోదావరిలో రాజీ పాత్రలో అవకాశం అందుకుంది. అలా ఆ సినిమాలో హీరో మరదలు క్యారెక్టర్ లో నటించిన నీతూ నటనకు ప్రేక్షకులు పీద్దా అయ్యారు అంతేకాకుండా ఆమె టాలెంట్ అందం ఉన్నా కూడా ఆ తర్వాత నీతికి తెలుగులో సరైన అవకాశాలు రాలేదు.

ఆ తర్వాత తమిళ హిందీ తన మాతృ భాష అయిన భోజపురి సినిమాల్లో కూడా నటించింది. ఇక చివరిగా ఈమె 2021లోని హాలీవుడ్ నెవర్ బ్యాక్ డౌన్ అనే మూవీలో మెరిసింది. ఇదిలా ఉంటే.. సినిమాల్లో హీరోయిన్‌గా తన అందంతో కట్టి పడేసిన నీతూ చంద్ర.. కరాటేలో బ్లాక్ బెల్డ్ సాధించిందట. కరాటే, తైక్వాండో విద్యల్లో రాణించి.. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంది. కాగా 2018లో ప్రో కబడ్డీ లీగ్‌లో పాట్నా పైరేట్స్‌కు నీతూ కమ్యూనిటీ అంబాసిడర్‌గా చేసింది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్. నిత్యం తనకు సంబంధించిన గ్లామర్‌ ఫోటోలు షేర్ చేస్తుంటుంది. ఇక ఆ ఫోటోస్ నీతూ.. 42 ఏళ్ల వయసులో అదే చార్మ్‌తో అందర్నీ ఆకట్టుకుంటుంది. అలాగే  40 ప్లస్ లో కూడా  అల్లాడిస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: