తమిళ నటుడు కార్తీ కొన్ని సంవత్సరాల క్రితం లోకేష్ కనకరాజు దర్శకత్వంలో ఖైదీ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా పెద్దగా అంచనాలు లేకుండా తెలుగు లో కూడా విడుదల అయ్యి అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ద్వారా కార్తీ తెలుగు లో మరింతగా పెరగగా ... లోకేష్ కనకరాజ్ కి ఈ సినిమా ద్వారా ఇటు తెలుగు , అటు తమిళ్ ఇండస్ట్రీ లలో అదిరిపోయే రేంజ్ గుర్తింపు వచ్చింది. ఇకపోతే ఈ సినిమా 2019 వ సంవత్సరం అక్టోబర్ 25 వ తేదీన విడుదల అయింది ఈ సినిమా విడుదల అయ్యి నిన్నటి తో ఐదు సంవత్సరాలు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసింది. ఏ రేంజ్ లాభాలను అందుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.
ఈ మూవీ ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి నైజాం ఏరియాలో 2.2 కోట్ల కలక్షన్లను వసూలు చేసింది. సీడెడ్ ఏరియాలో 92 లక్షలు , ఉత్తరాంధ్ర లో 1.25 కోట్లు , ఈస్ట్ లో 52 లక్షలు , వెస్టు లో 42 లక్షలు , కృష్ణ లో 80 లక్షలు , గుంటూరు లో 70 లక్షలు , నెల్లూరు లో 32 లక్షల కలెక్షన్లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఫైనల్ బాక్సా ఫీస్ రన్ ముగిసే సరికి 7.15 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఈ మూవీ 4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగగా టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ 7.15 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసింది. దానితో ఈ మూవీ బయ్యర్లకి 3.15 కోట్ల లాభాలను అందించింది.