దేవర : నాలుగు వారాల రిపోర్ట్.. మిక్స్డ్ టాక్ తో అదరగొట్టడం అంటే ఇదే..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర పార్ట్ 1 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. జాన్వీ కపూర్ ఈ మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ కి జోడిగా నటించగా ... సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ఇప్పటివరకు నాలుగు వారాల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. మరి ఈ నాలుగు వారాల్లో ఈ సినిమా ఏ వారంలో ఏ రేంజ్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

ఈ సినిమా మొదటి వారం బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా 199.43 కోట్ల షేర్ ... 342.30 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

ఈ సినిమా 2 వ వారం బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా 34.54 కోట్ల షేర్ ... 65.70 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

ఈ సినిమా 3 వ వారం బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా 15.48 కోట్ల షేర్ ...26.80 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

ఈ సినిమా 4 వారం బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా 4.59 కోట్ల షేర్ ... 8.70 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

4 వారాల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి 254.04 కోట్ల షేర్ ... 443.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: