అఖండ 2 : బోయపాటి ప్లాన్ అదిరింది.. ఒక్క దెబ్బతో స్టార్ట్ కాకముందే అంచనాలు డబల్..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో బోయపాటి శ్రీను ఒకరు. ఈయన భద్ర అనే మూవీతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత కూడా ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు చాలా వరకు మంచి విజయాలు సాధించడంతో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. బోయపాటి తన కెరియర్ లో ఎక్కువ సినిమాలను బాలయ్యతో చేశాడు. బోయపాటి , బాలయ్య కాంబోలో ఇప్పటివరకు సింహ , లెజెండ్ అఖండ అనే మూడు మూవీలు రూపొందాయి.

ఈ మూడు సినిమాలు కూడా బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకోవడంతో వీరి కాంబోకు తెలుగు సినీ పరిశ్రమలోనే ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇకపోతే వీరిద్దరి కాంబోలో నాలుగవ సినిమాగా అఖండ 2 రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన లాంచింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఇక మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ ని సెట్స్ పైకి తీసుకువెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ స్టార్ట్ కాకముందే ఈ సినిమాపై అంచనాలు పెంచే విధంగా బోయపాటి అదిరిపోయే ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఏకంగా బాలయ్య కు ఎంతో అచ్చొచ్చిన హీరోయిన్ అయినటువంటి విజయశాంతి ని ఈ మూవీ లో కీలకమైన పాత్రలో తీసుకోవాలి అని బోయపాటి డిసైడ్ అయినట్లు బాలయ్య కూడా అందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది.

ఇది వరకు బాలయ్య , విజయశాంతి కాంబోలో రూపొందిన సినిమాలు చాలా వరకు బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నాయి. ఓ వైపు బాలయ్య , విజయశాంతి ... మరో వైపు బోయపాటి , బాలయ్య ఇలా హిట్ కాంబోలో రూపొందుతున్న సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు తారా స్థాయికి చేరే అవకాశం ఉంటుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: